News
News
వీడియోలు ఆటలు
X

హైదరాబాద్‌లో వర్షం వస్తే ఇళ్లపైకి నీళ్లొస్తాయి- హరీష్‌కు కారుమూరి కౌంటర్

అభివృద్ధి పాలనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రుల మధ్య వాదోపవాదాలు సాగుతున్నాయి. నిన్న మంత్రి హరీష్ చేసిన కామెంట్స్‌కి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై తెలంగాణ మంత్రి చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీలో పరిస్థితులకి, తెలంగాణలో పాలనకి జమీన్ ఆస్మాన్ ఫరక్ (భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా) ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. 

మంత్రి హరీష్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని సూచించారు కారుమూరి. హరీష్‌ రావు టైం చూసుకొని ఏపీ వచ్చే ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తామన్నారు. తెలంగాణ స్కూళ్లకు, ఏపీలో బడులకు తేడాగా గమనించాలన్నారు. హైదరాబాద్‌లో వర్షాలు వస్తే ఇళ్లపైకి నీళ్లు వస్తాయని ఎద్దేవా చేశారు.

అన్ని సౌకర్యాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తగలేసుకున్నారో ప్రజలు, ప్రతిపక్షాలే చెబుతున్నాయన్నారు కారుమూరి. ఒక్క హైదరాబాద్‌లో రోడ్లు వేస్తే సరిపోదని... రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఓట్లు వేసిన వారికే తెలంగాణలో లబ్ధికలిగిస్తున్నారని... ఆంధ్రప్రదేశ్‌ అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగిస్తున్నామన్నారు.  తాము చేసిన అభివృద్ధి మూలంగానే దేశంలోనే నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉన్నామన్నారు. 

సంగారెడ్డి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని హరీశ్‌రావు అన్నారు. అందుకే ఏపీలో ఓటు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని వారికి సూచించారు.

తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి అయ్యే ప్రతి కార్మికుడు రాష్ట్రంలో అంతర్భాగమే అని హరీశ్ రావు అన్నారు. ఎంతో మంది ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారని, ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది వచ్చారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఏపీ నుంచి వచ్చిన వారు అప్పుడప్పుడూ సొంతూరికి వెళ్లినప్పుడు అక్కడి రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏలా ఉంటుందో మీకు తెలియదా? అని అడిగారు. ‘‘అంత తేడా ఉన్నప్పుడు మరి మీకు అక్కడ ఓటెందుకు? అక్కడ బంద్‌ చేసుకొని ఇక్కడ నమోదు చేసుకోండి. మీరు కూడా మావాళ్లే’’ అని హరీశ్ రావు మాట్లాడారు. ఒక చోటే ఓటు పెట్టుకోండి.. గదీ తెలంగాణలోనే పెట్టుకోండి అని హరీశ్ రావు కోరారు. 

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఒక ఎకరం విస్తీర్ణంలో రూ.2 కోట్ల ఖర్చుతో కార్మిక భవనాలను నిర్మిస్తామని చెప్పారు. మేడే రోజున వీటికి శంకుస్థాపన చేస్తామని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి ఒక్కరూ ప్రయోజనాలు పొందడానికి వీలుగా భవన నిర్మాణ కార్మిక మండలిలో మెంబర్ షిప్ తీసుకోవాలని ఆయన సూచించారు.

తెలంగాణలో వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలను నిలిపివేసిందని హరీశ్ రావు అన్నారు. అదే ఏపీలో మోటార్ల దగ్గర మీటర్లు పెట్టి ఆ ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు తెచ్చుకుందని ఆరోపించారు. ఏపీకి, తెలంగాణకు ఉన్న తేడా ఇదేనని చెప్పారు.

Published at : 12 Apr 2023 01:05 PM (IST) Tags: Karumuri Nageswara Rao Telangana News ABP Desam Harish Rao breaking news Andhra Pradesh News

సంబంధిత కథనాలు

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!