అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని

Pawan Kalyan Pithapuram Tour | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తారని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.

Pawan Kalyan to visit Pithapuram on July 1 | అమరావతి: సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. జులై 1వ తేదీ నుంచి తన నియోజక వర్గం పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అదేరోజు (జులై 1న) సాయంత్రం పిఠాపురంలో మంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు. 3 రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. 

కొండగట్టుకు పవన్ కళ్యాణ్ 
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టులో పర్యటించనున్నారు. జూన్ 29వ తేదీన పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని జనసేన పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. నేటి నుంచి 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష కొనసాగించనున్నారు.

ప్రజల ఆకాంక్షలను శాసన సభలో ప్రతిఫలింపచేద్దాం.. సభ నియమావళిపై అవగాహన పెంచుకోవాలని, సభా సంప్రదాయాలు గౌరవించాలని జనసేన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. మహిళల రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడవద్దన్నారు. శాఖాపరమైన అంశాలను, ప్రజా సమస్యలను అధ్యయనం చేసి అసెంబ్లీలో జరిగే చర్చల్లో పాల్గొనాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు ఉక్కు పాదం మోపుదామన్నారు. జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు త్వరలో అభినందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.  

పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏం చెప్పారో, డిప్యూటీ సీఎం అయిన తరువాత సైతం సరిగ్గా అదే విధంగా కొనసాగుతున్నారు. మంత్రిగా శాఖల బాధ్యతలు స్వీకరించిన వెంటనే సుదీర్థంగా శాఖలపై అధికారులతో సమీక్షలు చేసి విషయాలు తెలుసుకుంటున్నారు. పెండింగ్ విషయాలు తెలుసుకోవడంతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సాధ్యాసాధ్యాలు, గత ప్రభుత్వం చేసిన పనులపై శ్వేతపత్రాలు విడుదలకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు ఫైళ్లపై పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు.

ఇటీవల  జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోని పాల్గొని పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ నుంచి తిరిగొస్తుంటే తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలు కనిపించగానే కాన్వాయ్ ఆపి, కుర్చీ వేసుకుని మరి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరి సమస్యలు పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మాట్లాడటంతో తను మాటల మనిషి కాదని, చేతల నేతగా నిరూపించుకుంటారని ప్రజలు భావిస్తున్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget