Weather Updates: తీరం దాటిన వాయుగుండం - ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా
Rains in Telangana AP: రాయలసీమ నుంచి కొమొరిస్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉత్తర దక్షిణ అల్పపీడన ద్రోణి బలహీనపడింది.

Rains In Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిశాలోని బాలాసోర్‌కు తూర్పు ఆగ్నేయంగా 250 కి.మీ దూరంలో, పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు తూర్పు ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, సాగర్ దీవులకు ఆగ్నేయంగా 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడన కేంద్రం.. తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమ నుంచి కొమొరిస్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉత్తర దక్షిణ అల్పపీడన ద్రోణి బలహీనపడింది.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటింది. దీంతో రాష్ట్రానికి ఎలాంటి అధిక వర్ష ముప్పు లేదు. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుంది. కనిష్ట ఉష్ణోగ్రత 23 కాగా, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు నమోదు కానుంది. ఏ ప్రాంతానికి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయలేదు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 21, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో దాని ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లుండి తేలికపాటి జల్లులు పడతాయి.
Synoptic features of Weather inference (in Telugu)of Andhra Pradesh dated 21.08.2022 pic.twitter.com/XrkM9JYOIH
— MC Amaravati (@AmaravatiMc) August 21, 2022
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
Also Read: Amit Shah Meets Ramoji Rao: రామోజీరావుతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ - నేతల్లో పెరిగిన ఉత్కంఠ !
Also Read: మునుగోడు నుంచి అమిత్‌షా ప్రశ్నల వర్షం- కేసీఆర్ ఇచ్చిన హామీల సంగతేంటని నిలదీత
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

