By: ABP Desam | Updated at : 17 Jan 2022 10:05 AM (IST)
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్ (Representational Image)
Weather Updates In AP and Telangana: ఏపీ, తెలంగాణలో నేడు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో వేగంగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా మరో రెండు రోజులు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో చలి తీవ్రత కాస్త పెరిగింది. కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి), పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు..
దక్షిణ కోస్తాంధ్రలో నేటి వర్షాలు కురవనున్నాయి. తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావం అధికమైతే రెండు రోజులపాటు వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం, పంట ఉత్పత్తులను నీటి పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు సైతం తేలికపాటి జల్లులు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ మరుసటి రోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అత్యల్పంగా కళింగపట్నంలో 19.4 డిగ్రీలు, నందిగామలో 19.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జంగమేశ్వరపురంలో 19.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాయలసీమలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రేపు కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. రాయలసీమలోని ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, నంద్యాలలో 20.6 డిగ్రీలు, కర్నూలులో 20.1 డిగ్రీలు, తిరుపతిలో 22 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాల నేపథ్యంలో చలి గాలులు వీస్తున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో పలు జిల్లాల్లో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఉరుములు, మెరుపులతో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే
Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?