Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Prakasam Kothapatnam Beach Boat Accident: ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన బోటులో . 4 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 15 మంది గల్లంతుపై అయినట్లు భావిస్తున్నారు.

Kothapatnam Boat Capsized Dead Bodies Found: ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. సముద్రంలో వేటకు వెళ్లి బోటు ప్రమాదానికి గురైనట్లు అనుమానిస్తున్న ఒక మత్స్యకార బోటు సముద్రపు అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. తీరానికి చేరుకున్న ఆ పడవలో నాలుగు మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే పోలీసులకు, మెరైన్ సిబ్బందికి సమాచారం అందించారు. సముద్రంలో అనూహ్యంగా వచ్చిన అలల ఉధృతికి బోటు బోల్తా పడి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో మొత్తం 15 మందికి పైగా మత్స్యకారులు ఉన్నట్లు భావిస్తున్నారు. తీరానికి వచ్చిన బోటులో 4 మృతదేహాలు లభించగా, మిగిలిన వారంతా సముద్రపు ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే కొత్తపట్నం పోలీసులు, మెరైన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పడవను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
బోటులో దొరికిన మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వారు పొరుగున ఉన్న తమిళనాడు ప్రాంతాని చెందిన మత్స్యకారులా లేక స్థానిక తీరప్రాంత గ్రామాలకు చెందినవారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మిగిలిన గల్లంతైన వారి కోసం మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. నౌకలు, స్థానిక మత్స్యకారుల పడవల సహాయంతో తీరప్రాంతమంతా జల్లెడడుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఎదురై బోటు కంట్రోల్ తప్పిందా లేక ఏదైనా పెద్ద నౌక ఢీకొట్టిందా అన్న కోణంలోనూ మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















