అన్వేషించండి

MPTC ZPTC Elections Polling: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!

AP MPTC ZPTC Elections Polling 2026: ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా కొనని మండలాల్లో ఓటింగ్ వాయిదా వేశారు.

AP MPTC ZPTC Polling Postponed SEC:  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల సమరానికి తెరలేచింది.  మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం , జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం  ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది.  రాష్ట్ర ఎన్నికల సంఘం   సవరించిన తేదీల ప్రకారం చేపట్టిన ఈ ఓటింగ్ ఘట్టంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లు బ్యాలెట్ పద్ధతిన తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే వాతావరణం అనుకూలించకపోవడం, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

మురసు తుఫాన్ కారణంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, బాపట్ల, ఏలూరు ,  ఎన్టీఆర్ జిల్లాలలో ఉదయం నుంచే ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం పడుతుండటంతో పోలింగ్ కేంద్రాలకు రావలసిన ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటం, రవాణా మార్గాలు నిలిచిపోవడంతో కొన్ని కేంద్రాలలో ప్రారంభ గంటల్లో ఓటింగ్ శాతం మందకొడిగా సాగింది. ఎన్నికల అధికారులు వర్షం పడకుండా షామియానాలు, వాటర్‌ప్రూఫ్ షెడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రవాహ తాకిడికి ఓటర్లు క్యూలైన్లలో నిలబడటంలో ఇబ్బంది పడుతున్నారు.

వర్ష తీవ్రత మరీ  ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ,  లోతట్టు గ్రామాలు ముంపునకు గురైన కొన్ని నిర్దిష్ట స్థానాల్లో పోలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. మౌలిక వసతులు దెబ్బతిని బ్యాలెట్ పెెట్టెలు, సిబ్బందిని సురక్షితంగా తరలించలేని స్థానాలను గుర్తించి, కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రాథమిక నివేదికల ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం సదరు కేంద్రాల్లో  పోలింగ్‌ వాయిదాకు ఆదేశించింది. పరిస్థితులు సర్దుమణిగిన అనంతరం వాయిదా పడిన కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు, పోలింగ్ సాఫీగా సాగుతున్న ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పట్టడంతో ఓటర్లు క్రమంగా బూత్‌ల వైపు వస్తున్నారు.

రాజకీయ పరంగా ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అధికార ఎన్డీయే కూటమి,  ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవలే మున్సిపల్ ఫలితాల్లో పట్టణాల్లో ప్రతిపక్షానికి షాక్ ఇస్తూ కూటమి సునామీ విజయాన్ని నమోదు చేయగా, గ్రామీణ ప్రాంతాలలో తమ పట్టు నిలుపుకోవాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. అదే సమయంలో మున్సిపల్ ఫలితాల ఊపుతో గ్రామాల్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుని మండలాధ్యక్షులు , జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాలను కైవసం చేసుకోవాలని కూటమి శ్రేణులు క్షేత్రస్థాయిలో గట్టిగా శ్రమిస్తున్నాయి.                                

మొత్తంగా, వర్షాల విఘాతం నడుమ ముగుస్తున్న ఈ పోలింగ్ ప్రక్రియ అనంతరం, అవసరమైన చోట్ల రీ-పోలింగ్‌ను పూర్తి చేసి నవంబర్ 7వ తేదీన లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రామీణ ఓటరు ఎవరి వైపు మొగ్గాడు, ఏ పార్టీ గ్రామీణ పరిషత్‌లపై జెండా ఎగురవేస్తుందో తేలేందుకు లెక్కింపు రోజు వరకు వేచి చూడాల్సిందే.
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, పైప్‌లైన్ ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, చర్యలకు ఆదేశం
పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, పైప్‌లైన్ ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, చర్యలకు ఆదేశం
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
YS Sharmila Daughters Wedding: నేడు వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వివాహ వేదికను ఎక్కడికి మారింది, రిసెప్షన్ వివరాలు
నేడు వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వివాహ వేదికను ఎక్కడికి మారింది, రిసెప్షన్ వివరాలు
Kota Rukmini vs YSRCP: పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టబోయి వైసీపీ సెల్ఫ్ గోల్ - కోట రుక్మిణి న్యాయపోరాటంతో ప్రతిపక్షం సైలెంట్ అయిపోయిందా?
పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టబోయి వైసీపీ సెల్ఫ్ గోల్ - కోట రుక్మిణి న్యాయపోరాటంతో ప్రతిపక్షం సైలెంట్ అయిపోయిందా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget