By: Ram Manohar | Updated at : 04 Jul 2023 12:02 PM (IST)
పుట్టపర్తిలోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. (Image Credits: ANI)
Sai Hira Global Convention Centre:
మోదీ చేతుల మీదుగా..
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ని వర్చువల్‌గా ప్రారంభించారు. పుట్టపర్తిలోని ఈ కేంద్రంలో ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించనున్నారు. వీటితో పాటు అకాడమిక్ ప్రోగ్రామ్స్‌ని కూడా ఇక్కడ కండక్ట్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌పర్ట్‌లు ఇక్కడికి వచ్చి తమ అభిప్రాయాలు పంచుకుంటారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ యువతకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కేంద్రం ద్వారా దేశానికి ఎంతో మంది మేధావులను అందజేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు.
"సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ఫోటోలు చూశాను. ఇది తప్పకుండా ఆధ్యాత్మిక సమావేశాలకు, కార్యక్రమాలకు కేంద్రంగా మారుతుంది. అకాడమిక్ ప్రోగ్రామ్స్ కూడా యువతకు ఉపయోగపడతాయి. ఈ అవకాశాన్ని యువతీ యువకులు అందిపుచ్చుకుంటారని, వాళ్లకు ఇది కచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఏదైనా సరే ఓ ఆలోచన గొప్పదవ్వాలంటే అది ఆచరణలోకి రావాలి. అభివృద్ధే లక్ష్యంగా భారత్ దూసుకుపోతోంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సమాజంలోని ప్రతి వర్గం తమ భాగస్వామ్యంతో దేశంలో మార్పు తీసుకొస్తున్నారు"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the Sai Hira Global Convention Centre in Puttaparthi, Andhra Pradesh, via video conferencing. pic.twitter.com/uWmeLixg2N
— ANI (@ANI) July 4, 2023
#WATCH | Prime Minister Narendra Modi during the inauguration of the Sai Hira Global Convention Centre in Puttaparthi, Andhra Pradesh, via video conferencing, says "I have seen pictures of this convention centre. This will be the centre of spiritual conferences and academic… pic.twitter.com/QNhX4wCntu
— ANI (@ANI) July 4, 2023
ఆయన ఆశీర్వాదం ఉంటుంది..
ఇదే కాన్ఫరెన్స్‌లో సత్యసాయి బాబా గురించి కూడా ప్రస్తావించారు ప్రధాని. ఈ కేంద్రానికి ఆయన ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయని అన్నారు. మన దేశంలోని సాధువులను ప్రవహించే నీళ్లతో పోల్చుతారని, వాళ్ల ఆలోచనలు ఎక్కడా ఆగకుండా అలా ప్రవహిస్తూనే ఉంటాయని తెలిపారు.
"సాధువులను ప్రవహించే నీళ్లతో పోల్చుతారు. అవి ఎక్కడా ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంటాయి. సాధువుల ఆలోచనలూ అంతే. కేవలం ఆలోచించడమే కాదు. ఆచరిస్తారు కూడా. నిరంతరం అలా శ్రమిస్తారు కాబట్టే వాళ్లు అలా సాధువులయ్యారు"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | Prime Minister Narendra Modi during the inauguration of the Sai Hira Global Convention Centre in Puttaparthi, Andhra Pradesh, via video conferencing, says "Saints are often described as flowing water in our country because saints never stop with their thoughts, nor do… pic.twitter.com/altpsTPWbc
— ANI (@ANI) July 4, 2023
Also Read: Gas Price Hike: రేటు పెంచి షాకిచ్చిన గ్యాస్ కంపెనీలు, సిలిండర్కు ఎంత పెరిగిందంటే?
Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు
TTD News: శోభాయమానంగా శ్రీవారి స్నపన తిరుమంజనం, బంగారు గొడుగు ఉత్సవం
Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్
Chandrababu Custody Extends: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
YCP Counter To Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు
చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్
బీచ్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్రవంతి - ఫోటోలు వైరల్!
/body>