అన్వేషించండి

Pawan Kalyan: మన పార్టీపై కుట్రలు, దృష్టి మరల్చేందుకు కొన్ని శక్తుల కుట్రలు: పవన్ కళ్యాణ్ లేఖ

Pawan Kalyan: జనసేన పార్టీపై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని, మన దృష్టి మరల్చేందుకు పని చేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 

Pawan Kalyan: జనసేన పార్టీపై కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తమ దృష్టి మరల్చేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్న సమాచారం ఉందని తెలిపారు. జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అడుగు ఆచితూచి వేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తీవ్ర ఆర్థిక నేరాలు, ఆరోపణలపై మాట్లాడాల్సిన పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాలని జనసేన శ్రేణులు ఉద్దేశించి బహిరంగ లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం శ్రమిస్తున్న ఈ తరుణంలో మన పార్టీ దృష్టిని మళ్లించడానికి, మన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని కుట్రపూరితు శక్తులు నిరంతరం పని చేస్తున్నాయని హెచ్చరించారు. ఈ మేరకు లేఖ విడుదల చేసి జాగ్రత్తలు చెప్పారు. 

లేఖలో ఏముందంటే..

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించడానికి, మన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పని చేస్తున్నాయి. వాటిని అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్ళవలసి ఉంది. మనకు సానుకూలంగా ఉన్న రాజకీయ పక్షాలు, నాయకులకు మన పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బ తీసే కల్పిత సమాచారాన్ని మన శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్లు మన వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకువెళ్ళండి. వారి సూచనలు, సలహా మేరకు మీరు మాట్లాడండి.

పార్టీలోని నాయకులు, వీర మహిళలు, జన సైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది. కనుక సదా అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలి. స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మన మాటలు ఉండాలి. ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దు. ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయకండి. అది పార్టీకి, సమాజానికి కూడా హితం కాదు.

నన్ను విమర్శించే వారికి, వ్యక్తిగతంగా దూషించే వారికి బదులు చెప్పే సమయంలో నేను చాలా అప్రమత్తంగా ఉంటానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే, ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటను బేరీజు వేసుకుంటూ హద్దులు దాటకుండానే కొంత తగ్గి బదులు చెబుతాను. ఎందుకంటే మన నుంచి వచ్చే ప్రతీ మాటకు అంత బలం ఉంటుంది. ఆ బలం అపసవ్యంగా మారకూడదు. నేనంటే ఇష్టంలేని వారికి కూడా శుభ సమయాలలో వారికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేస్తుంటాను కదా! ఇలా చేయడం అంటే సమాజంలో సమతుల్యత, సృహుద్భావం నెలకొనాలనే.

ముఖ్యంగా ఈ విషయాలను మరిచిపోకండి...!

1. సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయకండి.
2. కేవలం మీడియాలో వచ్చిందనో లేదా ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కానీ అంశాల గురించి మాట్లాడకండి.
3. పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడకండి. ఈ విషయంలో మేలు చేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా.
4. మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాలలో చిన్న చితక నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైన విమర్శలుగా భావించండి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దు. మీ శ్రేయస్సును కాంక్షించే.. మీ పవన్ కళ్యాణ్' అని పేర్కొన్న లేఖను పార్టీ అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget