అన్వేషించండి

Pawan Kalyan : వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి - జగన్‌ను మరోసారి గురి పెట్టిన పవన్ !

వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. చెట్ల నరికివేతపై ఆయనీ విమర్శలు చేశారు.

 

Pawan Kalyan :    వైసీపీ పాలనలో చెట్లు కూడా విలపిస్తున్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు.  కొట్టేసిన చెట్ల దృశ్యాలతో ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు.  ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు   ఈ విషయం కూడా తెలుసుకోవాలి...వృక్షో రక్షతి రక్షితః అని ట్వీట్ చేశారు.                                            

  పవన్ కల్యాణ్ పెట్టిన ఫోటోలన్నీ  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనివి.   అమలాపురంలో ఈనెల 26న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను అధికారులు తొలగించడం వివాదాస్పదం అవుతోంది.  స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుంచి బాలయోగి ఘాట్ వరకు సీఎం రూట్ మ్యాప్  ప్రకారం రోడ్డు పక్కన ఉన్న చెట్లను  అధికారులు కొట్టేశారు.  ముఖ్యమంత్రి ఒక్కరోజు పర్యటన కోసం పర్యావరణాన్ని కాపాడే చెట్లను నరికి వేయడం దారుణం అంటూ విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.       

అంతే కాకుండా సీఎం హెలికాప్టర్ దిగేందుకు  ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ వద్ద ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లను నరికి హేలీప్యాడ్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. అవి ముఫ్ఫై ఏళ్ల వయసు ఉన్న చెట్లని.. వాటిని కొట్టేయాల్సిన అవసరం లేదని అమలాపురం ప్రజలు అంటున్నారు. అమలాపురంలోని ఎస్ కే బీ ఆర్ కళాశాల, కిమ్స్ మెడికల్ కళాశాలలో రెండు హెలీ ప్యాడ్ లు ఉన్నప్పటికీ అవి పరిగణలోకి తీసుకోకుండా రూ. 15 లక్షలు ప్రజాధనం వెచ్చించి.. పెద్ద ఎత్తున చెట్లను కొట్టి వేసి.. కొత్త హెలీప్యాడ్ నిర్మించారన్న విమర్శలు వస్తున్నాయి.                                                           

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసానికి నిదర్శనం అని, మరోసారి అమలాపురంలో నిరూపితమవుతుందని చెట్లు నరికివేతపై  జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు విమర్శలు గుప్పించారు. అమలాపురం చెట్ల నరికి వేత వీడియోలను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ నేరుగా జగన్ పై ఇవే ఫోటోలతో మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

AP MPTC ZPTC Election Results: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం.. ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం.. ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే
AP MPTC ZPTC Election Results Live Updates: ఏపీ పరిషత్ ఫలితాలు.. బొత్స ఫ్యామిలీకి షాక్... జడ్పీటీసీ ఎన్నికల్లో కుమార్తె బొత్స అనూష పరాజయం
ఏపీ పరిషత్ ఫలితాలు.. బొత్స ఫ్యామిలీకి షాక్... జడ్పీటీసీ ఎన్నికల్లో కుమార్తె బొత్స అనూష పరాజయం
Botsa Anusha: బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
బొత్స కుటుంబానికి బిగ్ షాక్ - బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో కుమార్తె అనూష ఓటమి
MPTC ZPTC Election Results: పరిషత్ పోరులో మెజార్టీల రికార్డులు.. పల్నాడులో కూటమి అభ్యర్థుల ప్రభంజనం!
పరిషత్ పోరులో మెజార్టీల రికార్డులు.. పల్నాడులో కూటమి అభ్యర్థుల ప్రభంజనం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
Kohli Breaks Ponting Record: పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
Bigg Boss Season 10 Today November 7th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఫ్యామిలీ వీక్ త్యాగం చేసిన నరేశ్! దేబ్జానీని తన్నిన ముకేశ్! నాగ్ తీర్పు సూపర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఫ్యామిలీ వీక్ త్యాగం చేసిన నరేశ్! దేబ్జానీని తన్నిన ముకేశ్! నాగ్ తీర్పు సూపర్!
MPTC ZPTC Election Results: పరిషత్ పోరులో మెజార్టీల రికార్డులు.. పల్నాడులో కూటమి అభ్యర్థుల ప్రభంజనం!
పరిషత్ పోరులో మెజార్టీల రికార్డులు.. పల్నాడులో కూటమి అభ్యర్థుల ప్రభంజనం!
Sai Durgha Tej Kiran : కాబోయే భార్యతో సాయి దుర్గా తేజ్ - క్యూట్ ఫోటో షేర్ చేసిన హీరో
కాబోయే భార్యతో సాయి దుర్గా తేజ్ - క్యూట్ ఫోటో షేర్ చేసిన హీరో
Embed widget