అన్వేషించండి

Paritala Sunitha: పరిటాల సునీత వినూత్న ఆలోచన, ప్రజల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు

Telugu News: పరిటాల సునీత తొలిరోజు చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు తమ సమస్యల్ని ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు.

Paritala Sunitha Latest News: మాజీ మంత్రి పరిటాల సునీత ప్రజాసమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా ముందుకెళ్తున్నారు. ప్రతి రోజు సమస్యలు చెప్పుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు వెంకటాపురం లేదా అనంతపురం తరలివస్తున్నారు. ఇది ప్రజలకు ఒకింత భారంగా మారింది. అందుకే ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని పరిటాల సునీత భావించారు. ఇందులో భాగంగా తొలిరోజు చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యల్ని ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరితో నేరుగా సునీత మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఓపికగా వారి సమస్యలు విన్నారు. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో తమ భూములను వైసీపీ నాయకులు దౌర్జన్యంతో ఆక్రమించారని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 

ఎన్నో ఏళ్ల నుంచి తాము సాగులో ఉన్నప్పటికీ.. ఆన్ లైన్ లో నుంచి తొలగించి వైసీపీ నాయకులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఎమ్మెల్యే ముందు వాపోయారు. తమ భూములు తమకు దక్కేలా చూడాలని విన్నవించారు. పింఛన్లు పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ తమకు ఇవ్వడంలేదని కొందరు.. గతంలో వచ్చే పింఛన్లను తొలగించారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేషన్ కార్డుల విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. వీటిపై కనీసం ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని పలువురు వినతులు అందజేశారు. చెన్నేకొత్తపల్లి గ్రామంలో పశువుల సంత ఏర్పాటు చేయాలని.. బీసీ కాలనీలో ఆలయ నిర్మాణం, స్థానిక ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, వైద్యులను నియమించాలని ప్రజలు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు. Paritala Sunitha: పరిటాల సునీత వినూత్న ఆలోచన, ప్రజల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు

తాగునీటి సమస్య, నూతన గృహాలు మంజూరు తదితర సమస్యలు ఎక్కువగా కనిపించాయి. వీటిలో కొన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. మరికొన్నింటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. బడ్జెట్ కు సంబంధించిన అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పనులు చేపడుతామని సునీత అన్నారు. ఇక నుంచి ప్రతి మండలంలోనూ గ్రీవెన్స్ నిర్వహిస్తామని.. ప్రజలు వారి మండలానికి వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. మంగళవారం రోజు కనగానపల్లిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Embed widget