Nimmala : నిమ్మల రామానాయుడు ఏటిగట్టు పోరాటం - చివరికి అరెస్ట్ ! అసలేం జరిగిందంటే ?
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. దళితుల భూములు స్వాధీనం చేసకోవద్దని ఆయన ఆందోళన చేస్తున్నారు.
Nimmala : దళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. యలమంచిలి మండలం చించినాడ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని అరెస్టుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. నిమ్మలను అరెస్ట్ చేయనీకుండా దళితులు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. చివరకు ఎమ్మెల్యే రామానాయుడిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని.. పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
#దళితులకు_అండగా_నిలబడిన_నన్ను_అక్రమంగా_అరెస్ట్
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) June 6, 2023
పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో దళితులకు కేటాయించిన భూములలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక మట్టి మాఫియాను అడ్డుకున్న నన్ను అక్రమంగా అరెస్టు చేసిన పోలీస్లు... pic.twitter.com/Bjbn0KIuUf
చించినాడలో దళితుల భూముల స్వాధీనానికి సర్కారు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళితులకు మద్ధతుగా నిన్నటి నుంచి రామానాయుడు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళితులకు మద్దతుగా రామానాయుడు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ వద్ద దళితుల భూముల్లో సోమవారం రాత్రి బస చేశారు. మరుసటి రోజు ఉదయం పెరుగులంక సమీపంలో గోదావరి ఒడ్డున ఆరుబయటే స్నానం చేశారు. దళితులతో కలిసి అక్కడే అల్పాహారం తీసుకున్నారు.
#వేకువజామున_చించినాడ_గోదావరి_ఏటిగట్టుపై
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) June 6, 2023
దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా, పేదలకు అండగా నిన్న పెరుగులంక గోదావరి ఏటిగట్టు పైన ధర్నా, రాత్రి బస చేసి, ఎన్ని రోజులైనా దళితులకు అండగా ఉంటా... pic.twitter.com/bGpWwX57Hj
‘‘దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా, పేదలకు అండగా నిన్న పెరుగులంక గోదావరి ఏటిగట్టుపై ధర్నా చేశాను. రాత్రి అక్కడే బస చేశాను. ఎన్ని రోజులైనా దళితులకు అండగా ఉంటా’’ అని నిమ్మల రామానాయుడు సోషల్ మీడియాలో ప్రకటించారు.
మంగళవారం ఉదయం నిమ్మల రామానాయుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిమ్మలను అరెస్ట్ చేయనీయకుండా దళితులు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. రామానాయుడిని అదుపులోకి తీసుకుని.. పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.