(Source: ECI/ABP News/ABP Majha)
NTR Birth Anniversary : మహనీయుడు ఎన్టీఆర్ - జయంతి సందర్భంగా ప్రధాని సహా ప్రముఖుల సంస్మరణ
Andhra News : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీసహా అనేక మంది సోషల్ మీడియాలో స్మరించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
TR Jayanti : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, నవరస నట సార్వాభౌముడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను ప్రధాని మోదీ సహా ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్టీఆర్ గురించి తెలుగులో ట్వీట్ చేశారు. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు . ఆయన కలలు కన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తామని ప్రకటించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన ధరించిన పాత్రలను , ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు .…
— Narendra Modi (@narendramodi) May 28, 2024
మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.
కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను.… pic.twitter.com/YFtWPKKW8n
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2024
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన కాంగ్రెస్ తరపున సీఎంగా ఉన్నప్పటికీ నివాళి అర్పించారు. ఎన్టీఆర్ తెలగు జాతి చిహ్నమని.. 101 జయంతి సందర్భంగా ఘన నివాళి అని ప్రకటించారు.
ఎన్టీఆర్…
— Revanth Reddy (@revanth_anumula) May 28, 2024
తెలుగుజాతి చిహ్నం.
ఆ మహనీయుడి 101 జయంతి సందర్భంగా ఘన నివాళి. #NTRJayanthi pic.twitter.com/59BPzgiqjc
విజయశాంతి కూడా సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. భారత రత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మహోన్నత వ్యక్తి, మహానటులు, ఆదర్శనేత, తరాలకు చెరగని తెలుగు జాతి కీర్తి శ్రీ ఎన్టీఆర్ గారు...
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 28, 2024
నన్ను ఎల్లప్పుడూ ఎంతో ఆదరణతో, ఆప్యాయతతో గౌరవించిన శ్రీ ఎన్టీఆర్ గారికి 101 వ జయంతి అభినందనలు...
ఆ మహనీయునికి రానున్న సంవత్సరమైనా భారతరత్న ప్రకటించబడుతుందని విశ్వసిస్తూ...
హర హర మహాదేవ్… pic.twitter.com/qqk6ZwROuI
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు స్మరించుకుని ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న అభిప్రాయాన్ని చెప్పారు.