అన్వేషించండి

చంద్రబాబు కోసం వైసీపీ ఎమ్మెల్యే బంధ విమోచన యాగం

చంద్రబాబు సీఐడీ బంధంలో చిక్కుకున్నారని, ఆయన జైలునుంచి బయటకు రావాలని ఆకాంక్షిస్తూ బంధ విమోచన యాగం నిర్వహిస్తున్నారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ వేదపండితుల ఆధ్వర్యంలో యాగం చేపట్టారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.

చంద్రబాబు విడుదల కోసం ఓవైపు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు దేవాలయాల్లో పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇటు నెల్లూరు జిల్లాలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బంధ విమోచన యాగం నిర్వహిస్తున్నారు. ఆయన కార్యాలయం ఆవరణలో ఈ యాగం చేపట్టారు. కోటంరెడ్డి సోదరులు యాగాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నారు. 


చంద్రబాబు కోసం వైసీపీ ఎమ్మెల్యే బంధ విమోచన యాగం

చంద్రబాబు సీఐడీ బంధంలో చిక్కుకున్నారని, ఆయన జైలునుంచి బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఈ బంధ విమోచన యాగం నిర్వహిస్తున్నారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ వేదపండితుల ఆధ్వర్యంలో ఈ యాగం చేపట్టారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. చంద్ర బాబుకి ఎదురవుతున్న ప్రతిబంధకాలు తొలగాలని, రాజకీయ కుట్రలను తిప్పికొట్టే విధంగా ఆ భగవంతుడు చంద్రబాబుకి, లోకేష్ కి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ యాగం చేపట్టినట్టు తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 

కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులతో ప్రపంచలో ఉండే తెలుగువారంతా చంద్రబాబు కోసం చేస్తున్న పోరాటాలు, పూజలు ఫలించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్ర బాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పారు. 

తొలిరోజు అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హడావిడి సృష్టించారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ స్లోగన్లు ఇస్తూ వైసీపీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. పోడియం మందు హడావిడి చేసిన ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి కూడా ఉన్నారు. స్పీకర్ పై పేపర్లు విసిరివేశారు. చివరకు స్పీకర్ ముగ్గురిపై సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. ఆ ముగ్గురిలో కోటంరెడ్డి ఒకరు.

అడుగడుగునా అధికార పార్టీని విమర్శిస్తూ కోటంరెడ్డి టీడీపీ తరపున తన ఉనికి చాటుకున్నారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుని అదే స్థాయిలో విమర్శించేవారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇప్పుడు ఆయన పార్టీ మారడంతో టీడీపీ తరపున అంతే హుషారుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అసెంబ్లీ తాజా సెషన్ పూర్తయ్యే వరకు సమావేశాలను బహిష్కరిస్తున్నామని టీడీపీ తేల్చి చెప్పింది. దీంతో సమావేశాలకు ఇక టీడీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం లేదు. సమావేశాలకు హాజరు కాకపోయినా నిరసన కార్యక్రమాలతో మాత్రం టీడీపీ నేతలు హోరెత్తించే అవకాశం ఉంది. 

ఇటు జిల్లాలో కూడా కోటంరెడ్డి మిగతా నాయకులకంటే ప్రత్యేకంగా నిలిచారు. చంద్రాబు అరెస్ట్ తర్వాత తీవ్రంగాస్పందించారాయన. తన హౌస్ అరెస్ట్ విషయంలో కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను జైలులో పెట్టాలని కోరారు. ఇక రిలే నిరాహార దీక్షల్లోనూ రూరల్ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టారు. చంద్రబాబుకి మద్దతుగా జరిగిన సంతకాల సేకరణలో ఆయన రక్తంతో సంతకం చేశారు. చంద్రబాబు స్కిల్ కేసు నుంచి బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇప్పుడు బంధ విమోచన యాగంతో తన ప్రత్యేకత నిలుపుకున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మిగతా నాయకులంతా ఆయా ఆలయాలకు వెళ్లి సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కోటంరెడ్డి మాత్రం తన కార్యాలయ ఆవరణలో బంధ విమోచన యాగం చేపట్టారు. చంద్రబాబు జైలునుంచి బయటకు రావాలని, స్కిల్ కుంభకోణంలో ఆయన నిర్దోషిగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం చేపట్టారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget