By: ABP Desam | Updated at : 03 Feb 2023 11:50 AM (IST)
Edited By: Srinivas
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కోటంరెడ్డిపై కేసులు పెడతారంటూ లీకులిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి దమ్ముంటే లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా ఆడియో రికార్డింగ్ లు బయటపెట్టాలని సవాల్ విసిరారు రూరల్ ఎమ్మెల్యే. తనపై కేసులు పెట్టబోతున్నారంటూ ఆయనే మీడియాకి లీకులిచ్చారన చెప్పారు. సోషల్ మీడియా ఇన్ చార్జ్ గా ఉన్న సజ్జల కొడుకు భార్గవ్ రెడ్డి కూడా ఇలాంటి లీకులిచ్చారని ఆరోపించారు. పార్టీ కష్టకాలంలో అసలు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి ఎక్కడున్నారని నిలదీశారు. పార్టీ కష్టకాలంలో సోషల్ మీడియా సైనికులు కేసులు ఎదుర్కొన్నారని, జైళ్లకు కూడా వెళ్లొచ్చారని చెప్పారు. వారందర్నీ పక్కనపెట్టి ఇప్పుడు సజ్జల కొడుకుకి సోషల్ మీడియా ఇన్ చార్జ్ పదవి ఇవ్వడం హాస్యాస్పదం అన్నారు కోటంరెడ్డి.
నన్ను ఎన్ కౌంటర్ చేయండి..
తన మాట ఎప్పటికీ ఆగిపోదని, కేసులు పెట్టినా తాను భయపడబోనని అన్నారు కోటంరెడ్డి. నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడు చేస్తారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. రండి రండి.. ఎప్పుడొస్తారు, ఇప్పుడా, రేపా, ఎల్లుండా, ఏం కేసులు పెడతారో, ఎన్ని కేసులు పెడతారో మీరే నిర్ణయించుకోండి అని చెప్పారు కోటంరెడ్డి. తాను ఏ కేసులకు భయపడబోనని, తన గొంతు ఆపే ప్రసక్తే లేదన్నారు. ముందు ముందు మరిన్ని ప్రెస్ మీట్లు ఉంటాయని చెప్పారు. తన గొంతు ఆపాలని ప్రయత్నిస్తే తనను ఎన్ కౌంటర్ చేయడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. తనను ఎన్ కౌంటర్ చేసి చంపేస్తేనే తన గొంతు ఆగిపోతుందని, లేకపోతే పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.
ఆదాలకు చురకలు, సలహాలు..
2019 ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల్సిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, టికెట్ కూడా ఖరారు అయిన తర్వాత చివరి నిమిషంలో వైసీపీలో చేరారు. అప్పటికి ఆయనకు రావాల్సిన కాంట్రాక్ట్ బిల్లులన్నిటినీ క్లియర్ చేసుకుని చివరి నిమిషంలో పార్టీ మారారు. ఆయన వైసీపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలా చివరి నిమిషంలో పార్టీలో చేరే చరిత్ర ఉన్న ఆదాల లాంటి వాడిని తాను కాదని పరోక్షంగా చెప్పారు కోటం రెడ్డి. నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ గా ఆదాలను ప్రకటించిన తర్వాత.. సజ్జల అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. కోటంరెడ్డి చివరి నిమిషంలో పార్టీ మారకుండా, ముందుగానే బయటకు వెళ్లి మంచి పని చేశారని సజ్జల అన్నారని, తన గురించి అంత మంచి అభిప్రాయం ఉన్నందుకు సంతోషం అన్నారు. చివరి నిమిషంలో పార్టీ మారే ఆదాల గురించి పరోక్షంగా చురకలంటించారు. ఇక ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సలహాలిచ్చారు.
ఆయన్ను పార్టీ ప్రత్యేకంగా చూసుకుంటుందని, ప్రత్యేకంగా ఆయన అడిగిన పనులన్నీ చేస్తుందని.. అందుకే రూరల్ లో సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. నెల్లూరు రూరల్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కారమయ్యేలా చూడాలని ఆదాలను కోరారు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి శుభాభినందనలు తెలిపారు.
ఇక సాక్షిలో తన గురించి తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు కోటంరెడ్డి. డిసెంబర్-25న తాను క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఉన్నానని, ఆరోజు తాను బులుగు బెంజ్ కారులో చంద్రబాబుని కలిసినట్టు సాక్షిలో వార్త వచ్చిందని, అది అవాస్తవం అన్నారు. నెలరోజుల ముందు వరకు తనకు ఎలాంటి ఉద్దేశం లేదని, పార్టీ తనపై నిఘా పెట్టిందని తెలిసిన తర్వాతే తన మనసుకి కష్టమేసిందని చెప్పారు. తాను పార్టీ వాడిని కానప్పుడు ఎవరినైనా కలిసే స్వతంత్రం తనకు ఉందన్నారు.
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
Anilkumar: వైసీపీ టికెట్ రాకపోయినా ఓకే, సీఎం జగన్ గెటౌట్ అన్నా నేను ఆయన వెంటే!
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!