News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

తిరుమలలో చిన్నారి మృతిపై వైసీపీ ఎమ్మెల్యే అనుమానం - లక్షిత పేరెంట్స్‌ను విచారించాలని డిమాండ్

చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారు మృతి చెందడంపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్‌ను విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్తున్న లక్షితను చిరుత ఎత్తుకెళ్లి చంపేసింది. శుక్రవారం రాత్రి ఘటన జరిగితే శనివారం ఉదయం పాప మృతి దేహం లభించింది. 

చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారు మృతి చెందిందని తెలుసుకున్న వారంతా అయ్యో పాపం అనుకున్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని కూడా సూచనలు చేశారు. తమ ఇంటి బిడ్డను కోల్పోయిన లక్షిత తల్లిదండ్రులు కూడా బోరున విలపిస్తున్నారు. 

ఈ చిన్నారి మృతిపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గం నుంచి వెళ్లిన భక్తులు జరిగిన విషయంపై విచారం వ్యక్తం చేస్తూనే అనేక అనుమానాలు లేవనెత్తారు. ఈ ఘటనలో లక్షిత తల్లిదండ్రులపై అనుమానంగా ఉందన్నారు. పోలీసులు వారిని లోతుగా దర్యాప్తు చేయాలనిసూచన చేశారు ప్రసన్న. ఇది ఆడపిల్లకు సంబంధించిన అంశమని అందుకే విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. 

చిన్నారి మృతిపై టీటీడీ ఛైర్మన్‌తో మాట్లాడినట్టు ప్రసన్న తెలిపారు. చాలా విచారం వ్యక్తం చేశారని.. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నట్టు కూడా చెప్పారని తెలిపారు. పేరెంట్స్‌ను కూడా విచారించాలని తాను చెప్పినట్టు పేర్కొన్నారు. బాలిక ఫ్యామిలీకి ఆర్థిక సాయం టీటీడీ చేయబోతుందని తెలిపారు ప్రసన్న. 

శ్రీనివాసుడికి చెల్లించుకోవాల్సిన మొక్కును తీర్చుకోవడానికి బయల్దేరింది లక్షిత ఫ్యామిలీ. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వాసులు దినేష్, శశికళ కుటుంబం ఏడు కొండ వేంకటేశ్వర స్వామిని చూసేందుకు వచ్చారు. పదిమంది కలిసి వెళ్తున్నందున కాలినడకన కొండకు వెళ్లాని నిర్ణయించుకున్నారు. 

అలిపిరిలోని నడక మార్గంలో  రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఫ్యామిలీలో ఎప్పుడూ హుషారుగా ఉండే లక్షిత వడివడిగా అడుగులు ఆడుతూ పాడుతూ ముందుకెళ్లింది. 

సీసీ కెమెరాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఆనందంగా అందరి కంటే చురుగా మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలా రాత్రి 11 గంటల సమయానికి  లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్దకు చేరుకునే సరికి పాప కనిపించలేదు. 

 

రాత్రి వేళలో పాప లక్షిత కనిపించకపోయే సరికి తల్లిదండ్రులతోపాటు వారితో వచ్చిన వారిలో కంగారు మొదలైంది. మొత్తం వెతికారు. పిలిచారు అయినా లక్షిత పలకలేదు. ఏం జరిగిందో ఏమో అనుకున్నారు. వెంటనే ఆలయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. 

పాప కనిపించడం లేదని తెలుసుకున్న టీటీడీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వడివడిగా ముందుకు నడుకుంటూ వెళ్లిన పాపను ఎవరైనా ఎత్తుకెళ్లిపోయారేమో అన్న కోణంలోనే వేట సాగించారు. ఉదయం చెట్ల పొదల్లో కాలిమార్గంలో డెడ్ బాడీ చూసేవరకు మాత్రం వాళ్లుకు చిరుత దాడి చేసిన సంగతి గమనించలేకపోయారు. 

ఆలయం వద్ద పాపపై చిరుత దాడి చేసి లాక్కెళ్లిపోయినట్టు ఇప్పుడు అక్కడ దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. అలా ఉదయం భక్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకునే చేరికి చిద్రమై ఉన్న పాప శరీర బాగాలు కనిపించాయి. మొదట ఇది చిరుత దాడి అంటూ చెప్పిన అధికారులు తర్వాత మాట మార్చారు. 

చిరుత దాడి చేసే అవకాశం లేదని ఎలుగుబంటి దాడి చేసి ఉండొచ్చని అనుమాన పడ్డారు.  దీంతో అందరిలోనూ అనమానాలు కలిగాయి. అయితే పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చిరుత దాడిలో పాప చనిపోయిందని క్లారిటీ ఇచ్చేశారు. 

రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన తర్వాత లక్షిత డెడ్‌బాడీని నెల్లూరుజిల్లాలోని స్వస్థలానికి తరిలించారు. చెంగుచెంగున లేడి పిల్లలా ఎగురుతూ కళ్లెదుటే మెట్లు ఎక్కిన చిన్నారి ఇలా కనిపించే సరికి దినేశ్ ఫ్యామిలి షాక్ తింది. వారి రోధనలకు అంతులేకుండా పోయింది. తల్లిదండ్రులతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు ఏడుపు అక్కడి వారందరనీ కంట తడి పెట్టించింది. 

Published at : 12 Aug 2023 01:33 PM (IST) Tags: kovuru mla Tirumala YSRCP MLA Prasanna Kuamar Reddy Lakshita

ఇవి కూడా చూడండి

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

టాప్ స్టోరీస్

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?