By: ABP Desam | Updated at : 05 May 2023 11:01 PM (IST)
Edited By: Srinivas
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి
"తనపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారెవరో కాదు, పార్టీ మనుషులే. నన్ను కావాలనే ఇబ్బంది పెడుతున్నారు. వారి పేర్లు నేను బయటకు చెప్పను, పార్టీని ఇబ్బంది పెట్టను. కానీ అధిష్టానం ఇలాంటిప్రచారాలను అడ్డుకోవాలి, వారి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. " ఇదీ మాజీ మంత్రి బాలినేని ప్రెస్ మీట్ సారాంశం. మరి ఆయన చెప్పినట్టు అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంగా, ఆయనపై ఆరోపణలు చేసేవారు, తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తుందా..?
బాలినేని వ్యవహారంలో పార్టీ అనుకూల మీడియా చాలా తెలివిగా వ్యవహరించింది. ఆయన నేరుగా పార్టీలోని నేతలు తనను ఇబ్బంది పెట్టారని కుండబద్దలు కొట్టారు. కానీ, వైసీపీ అనుకూల మీడియాతో మాత్రం ఆ పని ప్రతిపక్షనేతలెవరో చేసినట్టు కథనాలిచ్చారు. బాలినేని బాధపడ్డారన్నారే కానీ, ఆ బాధకు కారణం వైసీపీ నేతలే అనే విషయం మాత్రం దాచి ఉంచారు. అధిష్టానానికి ఆయన చేసిన సూచన కూడా హైలెట్ కాలేదు. ఒకరకంగా వైసీపీ దూరం పెట్టాలనుకుంటున్న నేతలెవరికీ సాక్షి సరైన కవరేజ్ ఇవ్వదు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా ఇతర నేతల విషయంలో కూడా ఇదే రుజువైంది. ఇప్పుడు బాలినేని వ్యవహారంలో కూడా అదే జరిగింది. ఆయన చెప్పిన అసలు విషయాన్ని మాత్రం హైలెట్ చేయలేదు. ఏదో మొహమాటానికి బాలినేని ఏడ్చారన్నట్టుగా వార్త ఇచ్చారు. అంటే పార్టీ దాదాపుగా బాలినేనిని పక్కనపెట్టడానికే డిసైడ్ అయిందనుకోవాలి.
కప్పు ఉంది, కప్పులో తుఫాన్ ఉంది..
అసలు కప్పులో టీ లేదు, అందులో తుఫాన్ ఎక్కడిది అని ప్రశ్నించిన సజ్జల, బాలినేని ప్రెస్ మీట్లో బాధపడిన తర్వాత మాత్రం రియాక్ట్ కాలేదు. అంతా మీడియా ఊహాగానాలే అన్న పార్టీ ప్రధాన కార్యదర్శి బాలినేని విషయంలో ఏమని సమాధానం చెబుతారో చూడాలి. ఆయన్ను పక్కనపెట్టాలని భావిస్తే మాత్రం ఈ వ్యవహారంపై ఎవరూ నోరు తెరిచే సాహసం చేయరు. పార్టీ ఉద్దేశమేంటో తెలిసిన తర్వాతే నాయకులంతా ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అవుతారు. ఈ రెండు రోజుల్లో దాదాపుగా పార్టీ నిర్ణయం ఏంటనేది తేలిపోతుంది. దాని ద్వారా బాలినేని భవిష్యత్తు కూడా తేలిపోతుంది.
ఐదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి.. ఇలాంటి నేత ఎవరైనా ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ బాలినేని ప్రెస్ మీట్ లో బేలగా మారిపోయారు. ఒకరకంగా ఆయన సింపతీకోసం ఎదురు చూస్తున్నారని తేలిపోయింది. కార్యకర్తలు, అభిమానులకోసం ఎందాకైనా పోరాడతానన్నారు. అంటే వారికోసమే తాను భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు.
బాలినేని ఎటువైపు..?
ప్రస్తుతానికి పుకార్లే అని బాలినేని స్వయంగా చెబుతున్నా, ఆయన టీడీపీ, జనసేనతో టచ్ లో ఉన్నారనే మాటలు బలంగా వినపడుతున్నాయి. ఒకవేళ ఆయన వైసీపీని కాదనుకుంటే, కచ్చితంగా ఆరెండు పార్టీల్లో ఏదో ఒకదానిని సెలక్ట్ చేసుకోవాల్సిందే. మరి బాలినేని ఎటువైపు వెళ్తారు, ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. బాలినేని వైసీపీని వీడితే అది కచ్చితంగా వైసీపీకి పెద్ద మైనస్ అనే చెప్పాలి. మిగతా నాయకులు వెళ్లిపోయినా జగన్ లైట్ తీసుకున్నారు, మరి బాలినేని వ్యవహారంలో ఆయన బుజ్జగింపులకు దిగుతారా లేక గతంలో జరిగిన మీటింగే ఫైనల్ అనుకోవాలా అనేది తేలాల్సి ఉంది.
Top 5 Headlines Today: బీజేపీలో ఉండలేమంటున్న నేతలు, మరికొంత సమయం కావాలంటున్న వైసీపీ
Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్
Top 10 Headlines Today: చెన్నై పాంచ్ పవర్, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ
GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !
Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !
బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం