News
News
X

వంటకు ఎలాంటి పాత్రలు మేలు, చిన్నారుల ప్రయోగం చూడండి

వంట కోసం తీసుకునే స్టీల్ పాత్రల అడుగున రాగి పూత ఎప్పుడైనా చూశారా. స్టీల్ కంటే రాగి తొందరగా వేడిని గ్రహిస్తుంది, అందుకే వాటి అడుగున ఆ పూత పూస్తారు. సరిగ్గా ఇదే ఫార్ములా ఉపయోగించారు నెల్లూరు విద్యార్థులు

FOLLOW US: 

వంట కోసం తీసుకునే స్టీల్ పాత్రల అడుగున రాగి పూత ఎప్పుడైనా చూశారా. స్టీల్ కంటే రాగి తొందరగా వేడిని గ్రహిస్తుంది, అందుకే వాటి అడుగున ఆ పూత పూస్తారు. సరిగ్గా ఇదే ఫార్ములా ఉపయోగించి మట్టి పాత్రల్లో వంటని సులభంగా, వేగంగా మార్చేశారు నెల్లూరు జిల్లా విద్యార్థులు. కావలి మండలం ఒట్టూరులోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న మృణాళిని, సాయి గౌతమ్ దీన్ని తమ ప్రయోగంగా మార్చుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

మట్టి పాత్రల్లో వంట ఆరోగ్యకరం, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కాలక్రంలో వంట వేగంగా అయ్యేందుకు అందరూ లోహపాత్రలవైపు మొగ్గు చూపారు. వంటకే కాదు, శుభ్రం చేసుకోడానికి కూడా సులభంగా ఉండటంతో అల్యూమినియం, స్టీల్ పాత్రలు వంటింట్లో వచ్చి చేరాయి. మట్టి కుండలు మాయమయ్యాయి. అయితే మట్టి కుండలకి కూడా అల్యూమినియం తొడుగు అమరిస్తే వంట వేగంగా కావడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని ఉండదని నిరూపించారు నెల్లూరు జిల్లా విద్యార్థులు.

కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యంపై స్పృహ పెరిగింది. ఆ క్రమంలో వచ్చిన ఐడియానే ఇది అని అంటారు ఒట్టూరు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయిని బిందు మాధవి. ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు తాము ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు తెలిపారు. మట్టి పాత్రల్లో ఇంకా వండుకునేవారు అక్కడక్కడా కనపడతారని, లోహపు పాత్రల్లో వంట వండటం వల్ల ఆ లోహాలు మెల్లమెల్లగా మన శరీరంలోకి చేరుకుని మన శరీరాన్ని విషతుల్యం చేస్తాయని చెబుతున్నారు. మట్టి పాత్రలకి అల్యూమినియం కోటింగ్ ద్వారా వాటి రూపు రేఖలు మార్చి వంటకు ఉపయోగించవచ్చని చెబుతున్నారు.

News Reels

మన పూర్వీకులు మట్టి పాత్రలతో వంట చేసుకొని తినటం వలన వారు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అలాంటి మట్టి పాత్రలను నాగరికత పేరుతో మనం పక్కనపెట్టామని, లోహపు పాత్రలలో వంటలు చేయటం ద్వారా ఆ పదార్థాలలో ఎటువంటి పోషక విలువలు ఉండవని చెబుతున్నారు. లోహపు పాత్రలను ఉపయోగించటంతో కొత్త సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. లోహపు వస్తువులను కరిగించి, మట్టి పాత్రకు క్రింది నుండి సగభాగం వరకు ఉండే విధంగా లోహపు పట్టీ తయారు చేసి వాటితో మట్టి పాత్రను కప్పి ఉంచాలని, వాటితో వంట వండుకుంటే వేగంగా వంట పూర్తవుతుందని చెప్పారు. దీన్ని ప్రయోగం ద్వారా వివరించారు. ఇలాంటి ప్రయోగం ద్వారా తాము చుట్టు పక్కలవారికి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. తాము కూడా మట్టి పాత్రల్లో వంటకు ఆసక్తి చూపిస్తున్నామని చెప్పారు.

మట్టిపాత్రల అలవాటుకి మళ్లీ తిరిగి వెళ్లాలని చెబుతున్నారు ఈ విద్యార్థులు. అందరికీ ఆదర్శంగా ఉండాలంటే, స్కూళ్లలో కూడా మధ్యాహ్న భోజనం మట్టి పాత్రల్లో వండి వడ్డించాలనే సలహా ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన ఈ విద్యార్థులు, రాష్ట్ర స్థాయిలో కూడా తమ కొత్త ఐడియాతో అందరినీ ఆకట్టుకుంటారని ఆశిద్దాం.

Published at : 18 Nov 2022 05:04 AM (IST) Tags: kavali news Nellore News clay pots pots for cooking

సంబంధిత కథనాలు

AP News Developments Today: నేడు మదనపల్లెకు సీఎం జగన్; పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు టూర్

AP News Developments Today: నేడు మదనపల్లెకు సీఎం జగన్; పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు టూర్

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Petrol-Diesel Price, 30 November 2022: పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్- తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై ఎఫెక్ట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

Gold-Silver Price 30 November 2022: బంగారం కొనాలంటే మాత్రం ఆలస్యం చేయకండి- ఈ నగరంలో కొంటే మరింత తగ్గనున్న రేట్‌!

Nellore Rotten Chicken: నెల్లూరులో నాన్ వెజ్ కొంటున్నారా ! మీ ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే !

Nellore Rotten Chicken: నెల్లూరులో నాన్ వెజ్ కొంటున్నారా ! మీ ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే !

PG Medical Seats in AP: ఏపీకి 630 పీజీ వైద్య సీట్లు - ఆనందంలో వైద్య విద్యార్థులు!

PG Medical Seats in AP: ఏపీకి 630 పీజీ వైద్య సీట్లు - ఆనందంలో వైద్య విద్యార్థులు!

టాప్ స్టోరీస్

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్

Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో

UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో