News
News
X

యూట్యూబ్‌లో పాఠాలు, నెల్లూరులో ప్రయోగాలు- ఫేక్‌ ఈడీ గ్యాంగ్‌ ప్లానింగ్‌ తెలిస్తే మతిపోతుంది

మూడు రోజుల క్రితం నెల్లూరులో నకిలీ ఈడీ అధికారుల వేషంలో కొంతమంది బంగారు వ్యాపారులకు టోకరా వేయాలని చూశారు. అసలీ ముఠా ఎలా ప్లాన్ చేసింది, ఎందుకు ఆ షాపునే టార్గెట్ చేసింది..?

FOLLOW US: 

మూడు రోజుల క్రితం నెల్లూరులో నకిలీ ఈడీ అధికారుల వేషంలో కొంతమంది బంగారు వ్యాపారులకు టోకరా వేయాలని చూశారు. ఆ ముఠాలో ఆరుగురు సభ్యులున్నారు. వారితోపాటు వారి కారు డ్రైవర్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలీ ముఠా ఎలా ప్లాన్ చేసింది, ఎందుకు ఆ షాపునే టార్గెట్ చేసింది అనే విషయాలన్నిటినీ మీడియాకు వివరించారు జిల్లా ఏఎస్పీ చౌడేశ్వరి. 

జైలు పరిచయం..
జైలు పరిచయంతో ఈ ముఠా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణాపురానికి చెందిన రమేష్, హైదరాబాద్‌లోని మియాపూర్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ఓ ఫైనాన్స్ సంస్థలో కోటి రూపాయలు మోసం చేశాడు. ఆ తర్వాత సొంత బావ హత్య కేసులో 2018లో కర్నూలు జైలుకెళ్లాడు. అదే జైలులో దొంగనోట్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న యోగానంద్ అతడికి పరిచయం అయ్యాడు. యోగానంద్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఈ ముఠాలో కలిశారు. మొత్తం ఆరుగురు తోడయ్యాడు. చెన్నైకి వెళ్లి నకిలీ ఐడీ కార్డ్ లు తయారు చేయించారు. పోలీస్ యూనిఫామ్ కొన్నారు. పందుల్ని కొట్టేందుకు అని చెప్పి ఓ ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేశారు. 

ఆషాపే ఎందుకు..?
ఇక నెల్లూరులో లావణ్య జ్యుయలరీ షాపుని ఎంచుకోడానికి కూడా ఓ కారణం ఉంది. లావణ్య జ్యుయలరీలో గతేడాది ఐటీరైడ్స్ జరిగాయి. దీంతో సులభంగా వారు భయపడతారనే కోణంలో ఆలోచించారు. అందులోనూ యజమానుల్లో విభేదాలుండటంతో.. వారి పని సులభం అవుతుందని అనుకున్నారు. ఇటీవల నెల్లూరు నగరంలోని హోల్‌ సేల్‌ బంగారు వ్యాపారుల వద్ద ఆభరణాలు కొని కందుకూరు, పొదిలి తదితర ప్రాంతాల్లోని వ్యాపారులకు ఈ ముఠా సభ్యులు కమీషన్‌ పద్ధతిపై అందించేవారని తెలుస్తోంది. ఇలా కమీషన్ వ్యాపారం చేస్తూనే దోపిడీకి పథక రచన చేశారు. ఒకేసారి డబ్బు సంపాదన కోసం ఈడీ అధికారుల పేరుతో ఆభరణాలు కాజేయాలనుకున్నారు. ఎలాగూ కమీషన్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి, బంగారు నగల మారకం కూడా వీరికి సులభం అవుతుందని భావించారు. 

యూట్యూబ్ లో పాఠాలు..
పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి చాలా తెలవైన వాడని, యూట్యూబ్ లో చూసి నేరాలకు పాల్పడటం నేర్చుకున్నాడని, ఇటీవల ఈడీ అధికారులకు ప్రత్యేక అధికారాలున్నాయనే వార్తల్ని సేకరించి దగ్గర పెట్టుకున్నాడు. యూట్యూబ్ లో ఈడీ అధికారుల తనిఖీలకు సంబంధించి వీడియోలు చూశాడు. ఆ తర్వాత పక్కా ప్లాన్ తో నెల్లూరులో బంగారు షాపులో గ్యాంగ్ తో సహా దూరాడు. దాదాపు 6 నెలలపాటు ఈ ముఠా నెల్లూరు నగరంలో రెక్కీ నిర్వహించింది. దీని కోసం రెండు ఇన్నోవా వాహనాలు ఉపయోగించారు. ఒక వాహనంలో కొంతదూరం పారిపోయి, ఆ తర్వాత వెంటనే మరో వాహనంలోకి మారిపోయేందుకు రెడీ అయ్యారు. కానీ వీరి ప్లాన్ బెడిసికొట్టింది. ఆరుగురు ముఠా సభ్యులతోపాటు, వీరికోసం నెల్లూరు చివర వేచి చూస్తున్న కారు డ్రైవర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఐటీ, ఈడీ అధికారులెవరూ సొమ్ముని వెంటనే జప్తు చేయరని, మేజిస్ట్రేట్ సమక్షంలో వాటిని సీజ్ చేస్తారని చెబుతున్నారు ఏఎస్పీ చౌడేశ్వరి. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న గ్యాంగ్ కి జీవిత ఖైదు పడే అవకాశముందని, ఆ మేరకు కఠినమైన సెక్షన్లు నమోదు చేశామని చెప్పారు. 

గతంలో నెల్లూరులో ఇంత పక్కా ప్లానింగ్‌తో ఏ ముఠా కూడా దొంగతనానికి ప్రయత్నించలేదు. అయితే ఈసారి ఆరుగురు ముఠా ఇంత పక్కాగా ప్లాన్ చేసినా పోలీసులకు దొరికారు. 12 కేజీల బంగారాన్ని వెంటనే మూటగట్టుకోవడం, కారులో తీసుకెళ్లాలని చూడటంతో గోల్డ్ జ్యుయలర్స్ అసోసియేషన్ వారికి అనుమానం వచ్చింది. ఆ తర్వాత వీరి బండారం బయటపడింది. 

Published at : 29 Aug 2022 03:58 PM (IST) Tags: Nellore news nellore police Fake Ed Rides

సంబంధిత కథనాలు

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు  వర్షాలు: IMD

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు: IMD

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం - అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: బలపడుతోన్న అల్పపీడనం - అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, IMD ఎల్లో అలర్ట్ జారీ

Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ? విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ?  విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?