మొబైల్ హంట్ సక్సెస్- రూ. 3.10 కోట్ల విలువైన సెల్ ఫోన్లు అప్పగింత
నెల్లూరు పోలీసులు మొబైల్ హంట్ లో సక్సెస్ అయ్యారు. ఏకంగా 1246 సెల్ ఫోన్లను వెదికి పట్టుకున్నారు. వాటి విలువ దాదాపు 3కోట్ల 10 లక్షల రూపాయలు కావడం విశేషం. నాలుగు విడతల్లో భారీగా సెల్ ఫోన్లను పట్టుకుని బాధితులకు వాటిని అందజేశారు.
సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే గతంలో వాటిపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. దొంగతనం చేసినవారు ఎంచక్కా సిమ్ మార్చేసి, ఐఎంఈఐ నెంబర్ మార్చేసి వాటిని వాడుకునేవారు. పోలీసులకు కూడా వాటిని వెదికి పట్టుకోవడం అంత సులభమయ్యేది కాదు. కానీ మారుతున్న టెక్నాలజీతో ఇప్పుడు పోయిన సెల్ ఫోన్లు వెదికి పట్టుకోవడం సులభం అయింది. అందుకే పోలీసులు ఇలాంటి కేసుల్ని ఇట్టే పరిష్కరిస్తున్నారు. వేల సంఖ్యలో సెల్ ఫోన్లు రికవరీ చేస్తున్నారు.
నెల్లూరు పోలీసుల హంట్..
నెల్లూరు పోలీసులు మొబైల్ హంట్ పేరుతో పోయిన సెల్ ఫోన్లను వెదికి పట్టుకుని బాధితులకు అప్పగించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. మొత్తం నాలుగు విడత్లలో సుమారు 3.10 కోట్ల విలువైన 1246 సెల్ ఫోన్ లను భాధతులకు అందజేశారు. నాలుగో విడతలో 602 ఫోన్లను వెదికి పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు కోటిన్నర రూపాయలు. విలువైన సెల్ ఫోన్లను పోగొట్టుకుని దిగాలుపడ్డ బాధితులు, తిరిగి వాటిని చూడగానే ఆశ్చర్యపోయారు, నెల్లూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
మొబైల్ పోతే ఏంచేయాలి..?
సెల్ ఫోన్ పోతే బాధితులు వెంటనే కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన CEIR(Central Equipment Identity Register) పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా మొబైల్ 9154305600 కు వాట్సర్ ద్వారా మెసేజ్ పంపాలి. ఇలా చేస్తే ఎఫ్ఐఆర్ లేకపోయినా ఆ ఫోన్ వెదికి పట్టుకుంటారు పోలీసులు.
గతంలో చైన్ స్నాచింగ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చైన్ స్నాచింగ్ తో పాటు, మొబైల్ తెఫ్ట్ కేసులు కూడా బాగా ఎక్కువయ్యాయి. ప్రయాణ సమయంలో ముఖ్యంగా మొబైల్ ఫోన్లను తస్కరిస్తూ ఈజీమనీకి అలవాటు పడ్డారు కొందరు. సెల్ ఫోన్లను తక్కువరేటుకి ఈజీగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో అమ్మేయొచ్చు. అందుకే ఇలా మొబైల్ ఫోన్లను కొట్టేస్తున్నారు. మొబైల్ పోగొట్టుకున్నవారు మాత్రం ఏం చేయాలో తెలియక దిగాలుపడుతున్నారు. ఫోన్ పోగొట్టుకుంటే మరొకటి కొనుక్కోవచ్చు కానీ, అందులో విలువైన సమాచారం మిస్ అయితే మళ్లీ రికవరీ చేసుకోవడం కష్టం. అది దుర్మార్గుల చేతిలో పడితే, పర్సనల్ వ్యవహారాలన్నీ బట్టబయలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఫోన్ తో పాటు, వ్యక్తిగత వివరాలు పోగొట్టుకున్నవారు ఇబ్బంది పడుతుంటారు.
సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనద్దు..
పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు అందించిన పోలీసులు.. సెకండ్ హ్యాండ్ ఫోన్లపై కీలక సూచనలు చేశారు. చౌకగా వస్తున్నాయని సెకండ్ హ్యాండ్ ఫోన్లను ఎవరూ కొనద్దని సూచించారు. అలా కొంటే తిరిగి వాటి విషయంలో ఎదురయ్యే సమస్యలకు వారే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
తాజాగా నెల్లూరు జిల్లా పోలీసులు ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అందించారు. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 602 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీలో శ్రమించిన సైబర్ క్రైమ్ అనాలిసిస్ బృిందాన్ని ఎస్పీ అభినందించారు.
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్
Chandra Babu News: ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు- అనంతరం జిల్లా పర్యటనలు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
/body>