Weather Fore Cast: రానున్న ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు వర్షాలు పడొచ్చని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉంటుంది. అందుకే మూడు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
View this post on Instagram
నెల్లూరు జిల్లా కోస్తా భాగాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ప్రకాశం జిల్లా దక్షిణ భాగాలు, చిత్తూరు జిల్లా తూర్పు భాగాల్లో కూడా మోస్తరు వర్షాలు పడతాయి. కడప జిల్లా తూర్పు భాగాల్లోకి కూడా వర్షాలు విస్తరిస్తాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.
Isolated to scattered light/moderate rainfall activity likely over south Coastal Andhra Pradesh & Yanam,
— India Meteorological Department (@Indiametdept) December 10, 2021
Rayalaseema, South Interior Karnataka, Tamilnadu, Puducherry & Karaikal and Kerala & Mahe during next 5 days. pic.twitter.com/1T5ONlAXap
అల్పద్రోణి ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, రామగుండం, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఐఎండీ వెల్లడించింది. చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది.