అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు జిల్లాలో ఒక నేత పెద్దమనిషి లాగా ముసుగేసుకుని తిరుగుతున్నారని, ఆ పెద్దమనిషి కూడా త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు మాజీ మంత్రి అనిల్. పరోక్షంగా మాజీ మంత్రి నారాయణపై ఆయన సెటైర్లు పేల్చారు. అక్రమాలకు పాల్పడే వారికి వయసుతో సంబంధం ఏముందని.. చంద్రబాబు వయసుని చూసి ఆయనకు ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ప్రశ్నించారు. భవిష్యత్తులో చంద్రబాబు, ఆయన బ్యాచ్ అదనపు కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చని స్పష్టం చేశారు. 23 నెంబర్ చంద్రబాబుకి కలసి రావడంలేదని, తన పుట్టినరోజు కూడా 23వతేదీయేనని.. అందుకే తనకూ చంద్రబాబుకి సెట్ కాదన్నారు అనిల్.
చంద్రబాబు అరెస్ట్ పై తనదైన శైలిలో స్పందించారు ఎమ్మెల్యే అనిల్. చంద్రబాబు అవినీతి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలున్నాయి కాబట్టే సీఐడీ చంద్రబాను అరెస్ట్ చేసిందని, అందుకే బెయిల్ కూడా రావడం లేదని చెప్పారు. చంద్రబాబు హయాంలో జరిగిన స్కాములు లు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయన్నారు అనిల్. ఆయన్ను 23 అనే నెంబర్ వెంటాడుతోందన్నారు. వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను లాగేసుకోవడంతో చంద్రబాబుని ఆ నెంబర్ పట్టిపీడిస్తోందన్నారు. ఖైదీగా చంద్రబాబు నెంబర్ కూడా 23 వచ్చిందన్నారు. జైలుకెళ్లిన తేదీ కూడా 23 అన్నారు. లోకేష్ పుట్టినరోజు కూడా 23 అని చివరకు ఆయన ఇంటినుంచే అది కలసి రావడం లేదని ఎద్దేవా చేశారు.
వీళ్ల హడావిడి ఎక్కువైంది..?
చంద్రబాబు అరెస్టు తర్వాత నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు నిరసనలు, ధర్నాలకోసం చందాలు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు అనిల్. స్వచ్ఛందంగా ఎవరూ రావడంలేదని, డబ్బులిచ్చి కార్యకర్తల్ని తెచ్చుకుంటున్నారని చెప్పారు. నారాయణ స్వయంగా 25 లక్షల రూపాయలు బడ్జెట్ నిరసన ప్రదర్శనలకోసం కేటాయించారన్నారు. జిల్లాలోని టీడీపీ నేతలెవరూ చంద్రబాబు అరెస్ట్ పై పెద్దగా స్పందించలేదన్నారు. అసలు నేతలు సైలెంట్ గా ఉంటే, కొసరు నేతల హడావిడి ఎక్కువైందన్నారు. టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడలేని హడావిడి చేస్తున్నారని అన్నారు. వైసీపీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలు ఎక్కువగా మాట్లాడుతున్నారని, వారి రచ్చ చూసి టీడీపీ నేతలు కంగారు పడుతున్నారని సెటైర్లు పేల్చారు. ఇదేం ఖర్మ అని వారి గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పారు అనిల్.
తమ పార్టీనుంచి వెళ్లి మునిగిపోయే పడవలో కూర్చున్న ఆ నేతలు ఎక్కువ రోజులు రాజకీయం చేయలేరని అన్నారు అనిల్. నెల్లూరు జిల్లాలో ఒక నేత పెద్దమనిషి ముసుగేసుకుని తిరుగుతున్నారని, ఆయన కూడా త్వరలో జైలుకెళ్తారని జోస్యం చెప్పారు. ఎవరెవరు గొంతు చించుకున్నా చంద్రబాబు దొరికిపోయిన దొంగ అన్నారు అనిల్. ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు కావడం తథ్యం అన్నారు. అసెంబ్లీలో కూడా చర్చకు రాలేక టీడీపీ నేతలు పరారయ్యారని ఎద్దేవా చేశారు అనిల్. స్కిల్ స్కామ్ పై చర్చకు పిలిస్తే రెండు రోజులు హడావిడి చేసి, మూడోరోజు నుంచి అసెంబ్లీకి రావడం మానేశారని, టీడీపీ నేతలు సభనుంచి కూడా పలాయనం చిత్తగించారన్నారు.
లోకేష్ కి ఢిల్లీలో ఏం పని..?
నారా లోకేష్ ఢిల్లీకి పరారయ్యారని, ఇక్కడికి వస్తే అరెస్ట్ అవుతానేమోననే భయంతో ఆయన అక్కడే మకాం వేశారని అన్నారు అనిల్. అక్కడ లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నలుగురు ఎంపీలతో కలసి ఫొటోలు దిగుతూ ఏదో చేస్తున్నారంటూ వారి అనుకూల మీడియాలో హడావిడి చేస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు ఇంటికి పరార్, లోకేష్ ఢిల్లీకి పరార్ అంటూ ఎద్దేవా చేశారు.
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
AP High Court: ఎస్ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?
Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Polytechnic Branches: పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్
SI Recruitment: ఎస్ఐ పోస్టుల భర్తీలో కీలక పరిణామం - కోర్టులోనే 'ఎత్తు' కొలవండి, హైకోర్టు ఆదేశం
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
/body>