అన్వేషించండి

Lokesh On Anil Kumar : నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అక్రమాస్తులు ఇవే - జాబితా ప్రకటించిన నారా లోకేష్ !

మాజీ మంత్రి అనిల్ కుమార్ అక్రమాస్తుల వివరాలను లోకేష్ మీడియాకు విడుదల చేశారు. అవి అక్రమాస్తులు కాకపోతే నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

Lokesh On Anil Kumar : నెల్లూరు పట్టణంలో యువగళం పాదయాత్రలో ... మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ అవినీతిపై నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై అనిల్ కుమార్ లోకేష్‌పై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. తాజాగా లోకేష్.. అనిల్ కుమార్ అక్రమాస్తుల వివరాలను వెల్లడించారు. ఎక్కడెక్కడ ఎంతెంత మేర భూములు ఆస్తులు కొనుగోలు చేశారో వివరించారు. అధికార దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున భూముల్ని కొన్నారని లోకేష్ ఆరోపించారు. మొత్తంగా రూ. వెయ్యి కోట్లకుపైగా అక్రమాస్తుల్ని అనిల్ సంపాదించారన్నారు. 

లోకేష్ ప్రకటించిన అనిల్ అక్రమాస్తుల వివరాలు

1. దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరు మీద 50 ఎకరాలు. విలువ రూ.10 కోట్లు. 
2. నాయుడుపేట లో 58 ఎకరాలు బినామీ పేర్లతో. విలువ రూ.100 కోట్లు. 
3. ఇనుమడుగు సెంటర్ లో  బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు. విలువ రూ.10 కోట్లు. 
4. ఇస్కాన్ సిటీ లో బినామీల పేర్లతో 87 ఎకరాలు. విలువ రూ. 33 కోట్లు. 
5. అల్లీపురం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 42 ఎకరాలు. విలువ రూ.105 కోట్లు. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి. 
6 సాదరపాళెం లో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 12 ఎకరాలు. విలువ రూ.48 కోట్లు. 
7 ఒక పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవి కి కోట్ల రూపాయలు వచ్చాయి. 
8 బృందావనం లో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు. విలువ 25 కోట్లు. 
9. దామరమడుగు లో బావమరిది పేరుతో 5 ఎకరాలు. విలువ 4 కోట్లు. 
10. గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేసాడు. 40 ఎకరాల్లో లే అవుట్  వేశారని లోకేష్ వివరాలు వెల్లడించారు. 
 

రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నానన్న అనిల్ కుమార్ 

 రాజకీయాల్లోకి వచ్చి తాను ఆస్తులు పోగొట్టుకున్నానని. అనిల్ కుమార్ ఇంతకు ముందు లోకేష్ సవాల్‌కు చాలెంజ్‌ చేశారు.  రాజకీయాల్లోకి రాకముందు మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి  కంటే ఒక్క పైసా ఎక్కువ ఉన్నా, భగవంతుడు  శిక్షిస్తాడని.. ఎక్కడకి రమ్మన్నా నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అనిల్ కుమార్ ప్రకటించారు.  ఇస్కాన్ సిటీలో పద్దెనిమిదిన్నర ఎకరాలు ఉండేదని.. కానీ ఇప్పుడు ఎకరా మాత్రమే ఉందన్నారు.  తన  తమ్ముడు అశ్విన్ మొదటి నుంచి ఒక హాస్పిటల్లో షేర్ హోల్డర్‌గా ఉన్నాడని.. ఆయన కు ఆస్తులు ఉంటే తనకు ఏం సంబంధం అని.. అనిల్ కుమార్ ప్రశ్నించారు. 

అనిల్ మొదట టిక్కెట్ తెచ్చుకోవాలన్న లోకేష్ 

మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ టాచ్‌లో  అభివృద్ధిపై చర్చకు నేను రెడీ..ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని లోకేష్ సవాల్ చేశారు.  జగన్ కూడా ఊరూరా హామీలిచ్చారు..అవికూడా విడుదల చేస్తామని చెప్పారు.   అనిల్ కు నెల్లూరు సిటీ టికెట్ ఉందా..లేదా.? జగన్ చెప్పారా.? అని లోకేష్ ప్ర్సనించారు.  నెల్లూరు ప్రజలు అనిల్ ను ఓడిస్తారన్నారు.  అనిల్ మొదట టికెట్ తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget