అన్వేషించండి

Dagadarthi Airport In Nellore: పీపీపీ విధానంలో రూ.916 కోట్లతో దగదర్తిలో ఎయిర్‌పోర్ట్, టెండర్లు ఆహ్వానించిన ఏపీఏడీసీఎల్

Andhra Pradesh News | పీపీపీ విధానంలో రూ.916 కోట్లతో దగదర్తిలో ఎయిర్‌పోర్ట్, టెండర్లు ఆహ్వానించిన ఏపీఏడీసీఎల్

Dagadarthi Airport In Nellore: అమరావతి: కూటమి ప్రభుత్వం ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. పలు నగరాలకు ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీతో తమ ప్రాంతం నుంచే విమాన ప్రయాణికులు రాకపోకలు పెరిగేలా చూస్తోంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా దగదర్తిలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం మొదటి దశ పనులను రూ.916 కోట్ల వ్యయంతో చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును PPP (పబ్లిక్- ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్‌లో  చేపట్టనున్నారు. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) దీనిని నిర్వహించనుంది. ప్రస్తుతం నిర్మాణ సంస్థ ఎంపిక కోసం ఏపీఏడీసీఎల్ అంతర్జాతీయ టెండర్‌ను ఆహ్వానించింది. అక్టోబర్ 10న ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుండగా.. బిడ్లు దాఖలుకు నవంబర్ 3 వరకు అవకాశం ఇచ్చింది. 

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విమాన సేవలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాశ్రయం నిర్మాణం చేపడుతోంది. పారిశ్రామిక, పర్యాటక కార్యకలాపాలు పెరుగుతున్నందున దగదర్తి విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణా విస్తృతంగా పెరుగుతాయని ఏపీఏడీసీఎల్ అంచనా వేసింది. నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే కడప, నెల్లూరు, చిత్తూరు,  తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని ఏపీఏడీసీఎల్‌ భావిస్తోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి విమానాశ్రయ నిర్మాణ సంస్థతో ప్రభుత్వం 45 ఏళ్ల పాటు అమలులో ఉండే రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ప్రతి 15 సంవత్సరాలను ఓ దశ కింద తీసుకుని.. దశల వారీగా ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో డిమాండ్ తక్కువగా ఉండగా, రెండో దశలో డిమాండ్ పెరిగి, మూడో దశలో గరిష్ట స్థాయికి చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. భవిష్యత్‌లో ప్రయాణికుల సంఖ్యతో పాటు  కార్గో సేవలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రారంభ దశలో ఎయిర్‌బస్‌ A-320/A-321 తరహా మీడియం సైజు విమానాలు నడిపాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి దగదర్తి విమానాశ్రయంలో ఒకే ఒక రన్‌వే నిర్మించనున్నారు.

దగదర్తిలో విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి అనుమతుల విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించడంతో పాటు 1,300 ఎకరాల భూమిని సేకరించింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు తీసుకుంది. అలాగే రక్షణ, హోంశాఖల అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. 2017లోనే పర్యావరణ, అటవీ అనుమతులు  లభించాయి. టర్బో కన్సార్షియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నిర్మాణ బాధ్యత అప్పగించగా, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ ఒప్పందం నుంచి తప్పుకుంది. తరువాత ఆ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి, తెట్టు (ప్రకాశం జిల్లా) వద్ద కొత్త విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget