By: ABP Desam | Updated at : 03 Feb 2023 11:48 AM (IST)
Edited By: Srinivas
రాజకీయంగా కోటంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టే- కాకాణి ఘాటు వ్యాఖ్యలు
నిన్ను అరెస్ట్ చేయం, నిన్ను ఎన్ కౌంటర్ చేయం, అసలా అవసరం ఎవరికీ లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డికి బదులిచ్చారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. కోటంరెడిని చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని, ఆయన భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారని, ఆయన ఉచ్చులో కోటంరెడ్డి పడ్డారని చెప్పారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, మ్యాన్ ట్యాపింగ్ అని, చంద్రబాబు చేసిన ఆ ట్యాపింగ్ ఉచ్చులో కోటంరెడ్డి పడ్డారని అన్నారు.
టీడీపీలోకి వెళ్లాలనుకుంటే ఒక్క కారణం సరిపోతుందని, కానీ వైసీపీలో ఉండాలంటే కోటంరెడ్డి వంద కారణాలు ఆలోచించాలన్నారు. జగన్, కోటంరెడ్డిని చాలా నమ్మారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. ఒకవేళ నిజంగానే కోటంరెడ్డికి వైసీపీలో అవమానం జరిగితే, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లి రాజకీయాల నుంచి విరమించుకోవాలన్నారు. అంతే కానీ, టీడీపీలోకి వెళ్తూ వైసీపీపై బురదజల్లడం సరికాదన్నారు. ట్యాపింగ్ అంటూ ఆయన చేసిన ఆరోపణలను ఆయనే రుజువు చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కాదని అధికారులు వివరణ ఇచ్చారని, ఆయనే కేంద్రం దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానన్నారు కదా, అదే చేయనీయండి అంటూ ప్రెస్ మీట్ లో చెప్పారు కాకాణి.
విచారణ అవసరం లేదు..
ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రభుత్వం చెబుతోందన, జరగని దాన్ని జరిగినట్టు చెపుతుంటే, దానిపై విచారణ ఏముంటుందని అన్నారు. ఆధారాలుంటే మీరే వాటిని కేంద్రానికి పంపించండి, అమిత్ షాకి పంపించండి అని కోరారు. కోర్టకైనా వెళ్లొచ్చని సూచించారు. కోర్టుకి వెళ్తే అది ట్యాపింగా, రికార్డింగా అనేది తేలిపోతుందన్నారు.
చంద్రబాబు చెప్పినట్టే కోటంరెడ్డి మాట్లాడారని, ఆయన ట్రాప్ లో పడిపోయారన్నారు. చంద్రబాబు క్రిమినల్ మెంటాలిటీ కోటంరెడ్డికి కనెక్ట్ చేశారని అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పారు. వైసీపీని వదిలి ఎవరూ కోటంరెడ్డి వెంట నడవబోరని చెప్పారు కాకాణి. కోటంరెడ్డి వెంట వెళ్లకుండా పార్టీకి కట్టుబడి ఉండేవారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కష్టకాలంలో పార్టీ వెంట నడిస్తే వారిని గుర్తు పెట్టుకుంటామన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ రూరల్ లో మరింత బలపడుతుందన్నారు కాకాణి.
కోటంరెడ్డితో మాట్లాడిన ఎమ్మెల్యేల పేర్లు, ఎంపీల పేర్లు, మంత్రుల పేర్లు ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు చాలామంది తనకు ఫోన్లు చేసి మాట్లాడారని, టీడీపీ నుంచి తామే బయటకు వెళ్లాలనుకుంటే కోటంరెడ్డి టీడీపీలోకి రావడం ఏంటని, తెలివి తక్కువ పని అంటున్నారని చెప్పారు. బహిరంగంగానే చాలామంది అలా చెబుతున్నారని, దానికి కోటంరెడ్డి ఏం సమాధానం చెబుతారన్నారు. పదవి రాకపోవడం వల్లే ఆయన అలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యకర్తలకు అవమానం జరిగింది, వారి శ్రమను గుర్తించడంలేదని కోటంరెడ్డి చెబుతున్నారని, ఒకవేళ అదే జరిగి ఉంటే, రూరల్ లో దానికి కారణం కోటంరెడ్డే కదా అని ప్రశ్నించారు కాకాణి.
కేతిగాడు పవన్..
పూర్వం తోలుబొమ్మలాటలో కామెడీ కోసం కేతిగాడు వచ్చేవాడని, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాస్త కామెడీ కోసం కేతిగాడుగా పవన్ వస్తున్నారని చెప్పారు. ఆనం రామనారాయణ రెడ్డికి సెక్యూరిటీ కల్పించాలనన్న పవన్ కామెంట్లపై కాకాణి ఇలా స్పందించారు.
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!
APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?
Nellore : ఆ ముగ్గురు గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా - మాజీ మంత్రి అనిల్ సవాల్
Fact Check: మాజీ మంత్రి అనిల్ ఫ్లెక్సీకి 15 మంది పోలీసులతో బందోబస్తు - ఈ వార్తలో నిజమెంత ?
Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం
Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్