X
Match 7 - 20 Oct 2021, Wed up next
NAM
vs
NED
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 8 - 20 Oct 2021, Wed up next
SL
vs
IRE
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Nellore News: ఈ బాషా ప్రాణం నిలబెట్టాడు.. అందరితో శభాష్ అనిపించుకున్నాడు

కళ్ల ముందే ప్రాణం కోల్పోతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. కత్తి పక్కన పడేసి ఓ చిన్న ప్రాణికి ప్రాణం పోశాడు.

FOLLOW US: 

నిత్యం వందల కోళ్లను చంపి మాంసం అమ్మే వ్యక్తి అతను. అయితే కళ్లముందు ఓ కాకి ప్రాణం పోతుంటే మాత్రం విలవిల్లాడిపోయాడు. ఆ కాకికి సపర్యలు చేసి దాన్ని బతికించాడు. పొట్టకూటి కోసం ఇక్కడ కోళ్ల ప్రాణాలు తీసే అదే వ్యక్తి. అక్కడ ఓ కాకి ప్రాణం కాపాడాడు. అతడు చేసిన పనిని మెచ్చుకున్నారు. కసాయికి కూడా మనసుంటుందన్న నిజాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది.  

Also Read:  టాలీవుడ్ పెద్ద దిక్కెవరో తేల్చనున్న "మా" ఎన్నికలు ! అసలు పోటీ మోహన్‌బాబు, చిరంజీవి మధ్యేనా ?

కొనఊపిరిలో ఉన్న కాకికి ఆయువు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ చికెన్ మార్కెట్ ఎదుట ఉన్న ఓ ట్రాన్స్ఫార్మర్ పైన రెండు కాకులు కరెంట్ షాక్ కు గురై కింద పడిపోయి గిలగిల కొట్టుకున్నాయి. దీంతో  ఒక్కసారిగా కాకుల గుంపు అక్కడికి చేరుకుని కావు కావు అంటూ కేకలు అందుకున్నాయి. ఎదురుగా చికెన్ కొట్టుకుంటున్న ఖాదర్ బాషా అలియాస్ ఆదామ్ అనే చికెన్ స్టాల్ నిర్వాహకుడు తను చేస్తున్న పని వదిలి పరిగెత్తుకుంటూ  కాకుల వద్దకు వెళ్లి కింద పడిపోయిన కాకులను పరిశీలించాడు. కరెంట్ షాక్ తో అప్పటికే ఒక కాకి చనిపోయింది. మరొకటి కొనఊపిరితో ఉంది. 

Also Read: చంద్రబాబు ఆరోపణలపై న్యాయపర చర్యలు.. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా టీడీపీ తీరు... టీడీపీపై సజ్జల ఫైర్

ఖాదర్ బాషా మెచ్చుకున్న స్థానికులు

ఖాదర్ బాషా వెంటనే కొన ఊపిరితో ఉన్న కాకిని తీసుకొచ్చి నోటిలో నీరు పోసి ఆ కాకిని నీళ్లతో ఒళ్లంతా తాడిపాడు. కొద్ది సేపు సపర్యలు చేసిన అనంతరం ఆ కాకిని రోడ్డుపై కొద్దిసేపు వదిలిపెట్టాడు. అప్పటికీ అది కోలుకోకపోయేసరికి కోళ్లను పెట్టే ఇనుప బుట్టలో కొద్దిసేపు ఉంచాడు. కాసేపటికి ఆ కాకి ఊపిరి పోసుకుని  అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయింది. చనిపోయింది అనుకున్న కాకి ఊపిరి పోసుకొని తిరిగి తన తోటి కాకులతో కలవడంతో దాని ప్రాణాన్ని కాపాడిన చికెన్ స్టాల్ ఖాదర్ బాషా సంతోషంతో తృప్తి చెందాడు. అక్కడ ఉన్న స్థానికులు ఖాదర్ బాషాను అభినందించారు. చనిపోయేది కాకే కదా నాకెందుకులే అనుకోకుండా చనిపోయే దశలో ఉన్న కాకికి ప్రాణం పోసిన చికెన్ స్టాల్ ఖాదర్ బాషా నిజంగా కసాయికి కూడా  మనసుంటుందని నిరూపించాడు. 

Also Read:  ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!

Also Read: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో పిటిషన్... ఏపీ కోర్టు ధిక్కరణపై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: AP News AP Latest news AP Breaking News Nellore news butcher saved crow

సంబంధిత కథనాలు

Breaking Updates Live: ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం : చంద్రబాబు

Breaking Updates Live: ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం : చంద్రబాబు

DGP : ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్

DGP :  ప్రజలు ఆవేశాలకు  గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్

Lokesh : ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు.. ఫ్యాన్ రెక్కలు విరిచేస్తామని లోకేష్ హెచ్చరిక !

Lokesh : ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపు.. ఫ్యాన్ రెక్కలు విరిచేస్తామని లోకేష్ హెచ్చరిక !

TDP Vs YSRCP: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

TDP Vs YSRCP: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

Chandrababu : ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..! అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !

Chandrababu : ఏపీలో పోలీసు వ్యవస్థ విఫలం.. కేంద్ర బలగాల రక్షణ కావాలి..!  అమిత్ షా, గవర్నర్‌లకు చంద్రబాబు విజ్ఞప్తి !
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Top 10 Richest Cities 2021: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్‌.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!

Top 10 Richest Cities 2021: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్‌.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!

Dhoni-Chris Gayle Meet: మిస్టర్‌ కూల్‌ ధోనీతో సుడిగేల్ ముచ్చట్లు..! సరదాగా కాసేపు అంటున్న కరీబియన్లు

Dhoni-Chris Gayle Meet: మిస్టర్‌ కూల్‌ ధోనీతో సుడిగేల్ ముచ్చట్లు..! సరదాగా కాసేపు అంటున్న కరీబియన్లు

Uttarakhand Flood: దేవభూమిలో జలప్రళయం.. వరదల ధాటికి 34 మంది మృతి

Uttarakhand Flood: దేవభూమిలో జలప్రళయం.. వరదల ధాటికి 34 మంది మృతి

Romantic Trailer: ‘రొమాంటిక్’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్.. ప్రేమను మోహం అనుకుంటున్నారట!

Romantic Trailer: ‘రొమాంటిక్’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్.. ప్రేమను మోహం అనుకుంటున్నారట!