అన్వేషించండి

AP Home Minster : ఏపీ హోంమంత్రిపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ..! అనర్హతా వేటు పడుతుందా..?

ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచిన మేకతోటి సుచరిత మతమార్పిడి చేసుకున్నారా లేదా అన్న అంశంపై నివేదిక సమర్పించాలని జాతీయ ఎస్సీ కమిషన్ గుంటూరు కలెక్టర్‌ను ఆదేశించింది. వారం రోజులు గడువు ఇచ్చింది.


ఆంధ్రప్రదేశ్  హోంమంత్రి మేకతోటి సుచరిత ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలోనూ ఆమె అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం ఆమె రిజర్వేషన్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ టీవీ ఇంటర్యూలో తాను క్రిస్టియన్‌ను అని.. తన కుటుంబం అంతా మతం మారిందని ఆమె చెప్పుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం మతం మరిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు. ఈ కారణంగా సుచరిత టీవీ ఇంటర్యూలో చెప్పిన దాన్ని బట్టి  లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వారం రోజుల్లోగా వివరాలు పంపాలని జాతీయ ఎస్సీ కమిషన్ గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఇప్పుడీ విషయం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది.

అయితే ఇలా మతం మారి ఎస్సీ రిజర్వేషన్‌ను దుర్వియోగం చేశారనే ఆరోపణలతో విచారణ ఎదుర్కొన్న  వారిలో సుచరిత మొదటి వారు కాదు. 2019లోనే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఆమె కూడా తాను క్రిస్టియన్‌ను అని.. తన భర్త కాపు సామాజికవర్గం వారని టీవీ ఇంటర్యూల్లో చెప్పుకున్నారు.  దీంతో నేరుగా రాష్ట్రపతి భవన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కూడా విచారణకు ఆదేశించారు.  ఎమ్మెల్యే శ్రీదేవి అఫడవిట్‌ దాఖలులో లోపాలపై, ఎస్సీ రిజర్వేషన్‌ దుర్వినియోగంపై వచ్చిన అభియోగాలపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా ఏపీ చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఎన్నికపై లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరం కోర్టులో కూడా పిటిషన్ వేసింది.అయితే రాష్ట్రపతి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ నివేదిక పంపారో లేదో స్పష్టత లేదు. ఆ తర్వాత ఆ కేసు సైలెంట్ అయిపోయింది. 

ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న వారిలో అత్యధికులు మత మారిన క్రిస్టియన్లే ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్రిస్టియన్ మత సంస్థను నడుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి . ఇతర రిజర్వుడు  నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచిన అనేక మంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారిపై కొన్ని సంస్థలు ఫిర్యాదులు చేయడం...  రాష్ట్రపతి  భవన్ లేదా జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేయడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఆ నివేదికలు బయటకు రావు. ఒక వేళ తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చినా అధికారంలో ఉంటారు కాబట్టి వారికే అనుకూలంగా నివేదికలు ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇప్పటి వరకు ఎవరి పదవికి వచ్చిన గండం లేదు. ఏపీ హోంమంత్రికీ గుంటూరు కలెక్టర్ వ్యతిరేక నివేదిక ఇస్తారని ఎవరూ ఊహించలేరు కూడా..! 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Dussehra 2026 Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 11 నుంచి దసరా ఉత్సవాలు! ఏ రోజు ఏ అలంకారం?
ఇంద్రకీలాద్రిపై 2026 అక్టోబరు 11 నుంచి దసరా ఉత్సవాలు! ఏ రోజు ఏ అలంకారం?
TTD Deputy EO Lokanatham Arrest: కల్తీ నెయ్యి కేసులో సీబీఐకి దొరికిన ఆధారాలు - టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అవినీతిలో సంచలన విషయాలు
కల్తీ నెయ్యి కేసులో సీబీఐకి దొరికిన ఆధారాలు - టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అవినీతిలో సంచలన విషయాలు
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Konda Surekha: సాయంత్రంలోగా రాజీనామా? లేదంటే బర్తరఫ్? - కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం!
సాయంత్రంలోగా రాజీనామా? లేదంటే బర్తరఫ్? - కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం!
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
Embed widget