అన్వేషించండి

Nara Lokesh: ల్యాప్ టాప్‌లు ఫ్రీగా పంపిణీ చేసిన నారా లోకేశ్, వీరికి మాత్రమే!

AP Latest News: దివ్యాంగ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి నారా లోకేశ్‌ నివాసానికి వచ్చి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి లోకేశ్‌ అభినందించి.. ఉచితంగా ల్యాప్‌ టాప్‌లను అందించారు.

Nara Lokesh Laptops: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలువురు విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు పంపిణీ చేశారు. వీరంతా జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన దివ్యాంగ విద్యార్థులు. ఇటీవలే ఆ విద్యార్థులకు నారా లోకేశ్ కారణంగా మేలు చేకూరిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్‌ ఆదేశాల మేరకు సత్వరం జీవో 225 విడుదల చేయడం వల్ల.. రాష్ట్రంలోని కొంత మంది దివ్యాంగులైన విద్యార్థులు ఎంతో సాయం పొందారు. ప్రభుత్వం జారీ చేసిన ఆ జీవో వల్ల ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు పొందారు.

దీంతో ఆ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉండవల్లిలోని మంత్రి నారా లోకేశ్‌ నివాసానికి వచ్చారు. జీవో జారీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి లోకేశ్‌ అభినందించారు. వారికి ఉచితంగా ల్యాప్‌ టాప్‌లను అందించారు. ‘సింపుల్‌ గవర్నమెంట్‌ - ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌’ విధానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్‌ ఈ సందర్భంగా చెప్పారు.

‘‘అధికారులతో యుద్ధ ప్రాతిపదికన జిఓ 225 విడుదల చేయించడంతో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన 25మంది దివ్యాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో  ఉండవల్లి నివాసానికి వచ్చి నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులందరినీ అభినందించాను. వారికి ల్యాప్ ట్యాప్‌లను బహుకరించాను. సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే మా లక్ష్యం అని వివరించాను’’ అని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

జీవో ఏంటి?
విజయవాడకు చెందిన మారుతీ పృథ్వీ సత్యదేవ్ అనే దివ్యాంగ విద్యార్థి జేఈఈ అడ్వాన్స్‌ లో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఆ ప్రకారం అతనికి చెన్నై ఐఐటీలో సీటు దక్కాల్సి ఉంది. కౌన్సిలింగ్ రౌండ్ -1లో ఐఐటీ మద్రాసులో సత్యదేవ్ కు సీటు వచ్చింది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఇంటర్ మెమోని అప్‌లోడ్ చేయడంలో సమస్య ఎదురైంది. ఏపీ ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్ట్ లలో ఒకదానికి మినహాయింపు ఉంటుంది. అలా మినహాయింపు ఉన్న సబ్జెక్టు విద్యార్థి రాయరు కాబట్టి.. సర్టిఫికేట్‌లో ఎప్పటినుంచో 'E' (Exemption) అని మాత్రమే ఉంచుతున్నారు.

దీన్ని ఐఐటీ మద్రాస్ అంగీకరించ లేదు. తనకు సహాయం చేయాలని విద్యార్థి ఈ ఏడాది జూన్‌ 22వ తేదీన మంత్రి లోకేష్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ సెకండ్ లాంగ్వేజ్ లో E కి బదులుగా కనీస మార్కులు పొందుపర్చాని బోర్డు అధికారులకు ఆదేశించారు. దీంతో 35 మార్కులుగా పేర్కొంటూ.. మెమో జారీ చేసినా ఐఐటీ నుంచి అంగీకారం రాలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక జీఓ ఉండాలని షరతు విధించారు. దీంతో వెంటనే జీఓ విడుదల చేయాల్సిందిగా లోకేశ్ ఆదేశాలిచ్చారు. అలా మొత్తం 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ లాంటి విద్యాసంస్థల్లో సీట్లు వచ్చాయి.

టాప్ హెడ్ లైన్స్

Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget