By: ABP Desam | Updated at : 26 Sep 2023 05:29 PM (IST)
అక్రమంగా చంద్రబాబు అరెస్ట్ - రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లిన నారా లోకేష్ !
Lokesh in Delhi : ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని .. ప్రతిపక్షాల్ని అణిచి వేస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును పార్టీ నేతలతో సహా కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుపై కక్షగట్టిన ఏపీ సర్కార్ ఏ ఆధారాలు లేకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేశారని స్కిల్ కేసు వివరాలు అదించారు. లోకేష్ తో పాటు ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఉన్నాయి. కక్ష సాధింపు లో భాగంగా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ని అరెస్ట్ చేసిన తీరు గురించి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా కేవలం అవినీతి బురద చల్లే లక్ష్యంతో అరెస్ట్ చేశారు అంటూ తమ వద్ద ఉన్న సమాచారాన్ని, ఆధారాలను రాష్ట్రపతి కి అందించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కోరారు.
అంతకు ముందు నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తనను ఏ 14గా చేర్చడంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. యువగళం పేరు వింటే సైకో జగన్ గజగజలాడుతున్నాడని.. ఏం చేసినా సరే యువగళం ఆగదని హెచ్చరించారు.
యువగళం పేరు వింటే సైకో జగన్ గజగజలాడుతున్నాడు. నా పాదయాత్ర ఆరంభం కాకూడదని జీవో 1 తెచ్చినా, ఆగని యువగళం జనగళమై గర్జించింది. ఎక్కడికక్కడ అడ్డుకున్నా జనజైత్రయాత్రగా ముందుకు సాగింది. మళ్లీ యువగళం ఆరంభిస్తామనే సరికి, నా శాఖకి సంబంధంలేని, అసలు వేయని…
— Lokesh Nara (@naralokesh) September 26, 2023
చంద్రబాబు అరెస్టు తర్వాత ఢిల్లీ వెళ్లిన లోకేష్ కేసు గురించి జాతీయ మీడియాలో తన వాదనలు వినిపించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో.. ఎంపీల ద్వారా దేశం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి వాస్తవాలు చెబుతున్నారని.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఏపీలో జరుగుతున్న అంశాలను వివరిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.
లోకేష్ ఈ వారాంతంలోగా యువగళం పాదయాత్ర ఎక్కడ ఆపారో అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. కేసు విషయాలను చూసుకోవడానికి పూర్తిగా న్యాయకోవిదులతో పాటు పార్టీపరంగా ఓ టీమును ఏర్పాటు చేసి.. తన పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ పరమైన వ్యవహారాలకు లోటు రాకుండా జాగ్రత్త పడాలనుకుటున్నారు. మరో వైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆయన తన నాలుగో విడత వారాహి యాత్రను ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నారు.
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Tirumala Children Missing: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం, పీఎస్ లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Andhra News : ఏపీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు - ఓటర్ల జాబితా అవకతవకలపై పూర్తి స్థాయి పరిశీలన !
CM Jagan Review: ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట రావాలి - తుపానుపై రివ్యూలో సీఎం జగన్
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
/body>