Byreddy sabari On Jagan: జగన్‌కు ప్రజలు కుర్చీ మడత పెట్టారు - వైరల్ అవుతున్న బైరెడ్డి శబరి పార్లమెంట్ ప్రసంగం
Nandyala MP: పార్లమెంట్‌లో జగన్ పాలనపై బైరెడ్డి శబరి చేసిన స్పీచ్ వైరల్ అవుతోంది. రాజ్యాంగ ఉల్లంఘనలతో జరిగిన పాలన చూడలేక ప్రజలు కుర్చీమడత పెట్టారని ఆమె తెలిపారు.
Byreddy Sabari speech on Jagan rule in Parliament is going viral: రాజ్యాంగంపై పార్లమెంట్ లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పలువురు ఎంపీలు రాజ్యాంగ ఉల్లంఘనలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంట్ లో చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది.జగన్ ఐదేళ్ల పాలనపై ఆమె అనర్గళంగా ప్రసంగించారు. ఆ పాలన చూడలేక ప్రజలు జగన్ కుర్చీని మడత పెట్టి పంపించారని ఆమె సెటైర్ వేయడంతో సభ కూడా మార్మోగిపోయింది.
జగన్ పాలనలో ఐదేళ్లు రాష్ట్రానికి అబ్సెసివ్ క్రిమినల్ డిజార్డర్
2019-2024 మధ్య పాలనలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఓసీడీ తో ఏపీ బాధపడిందన్నారు. ఓసీడీ అంటే.. అబ్సెసివ్ క్రిమినల్ డిజార్డర్ తో వైసీపీ నేతలు చేసిన అరాచకాలతో ప్రజలు బాధపడ్డారన్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్ల కాలంలో రాజ్యాంగంలో ఉన్న ప్రతి చాప్టర్ ను ఉల్లంఘించారని.. ప్రతి ఒక్క పౌరుడి హక్కులను కాలరాశారని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసి మూడు ప్యాలెస్‌లు నిర్మించుకున్నారు. విపరీతంగా అవినీతి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు.
Also Read : సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
రాజ్యాంగంలోని ప్రతి సెక్షన్ ను ఉల్లంంఘించిన వైసీపీ ప్రభుత్వం
ఎన్నికల ప్రక్రియను కూడా అపహాస్యం చేసేందుకు ప్రయత్నించారని పదిహేను లక్షలకుపైగా ఫేక్ ఓటర్లను చేర్పించిటన్లుగా ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా ఏకపక్షంగా నిర్వహించుకుని రాజ్యాంగ హక్కులను కాలరాశారని అన్నారు. అలాగే రాజ్యాంగం ప్రకారం గ్రామాలకు వచ్చిన నిధుల్ని కూడా మళ్లించారని గుర్తు చేశారు. రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులను కూడా కల్పించకుండా వేధించారన్నారు. బైరెడ్డిశబరి తన స్పీచ్‌లో వైసీపీ పాలనలో రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘించారో ప్రతి సెక్షన్ ను ఉదహరిస్తూ చెప్పడంతో పలువురు సభ్యులు బల్లలు చరిచి అభినందించారు.
స్పీచ్‌లో చివరిగా.. ఇవన్నీ భరించలేక జగన్మోహన్ రెడ్డిని కుర్చీ మడత పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు ఇంటికి పంపించేశారని తెలుగులోనే చెప్పారు. బైరెడ్డి శబరి కర్నూలు జిల్లాలో పైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా ఆమె పనితీరు కూడా అందర్నీ ఆకర్షిస్తోంది.