Balakrishna Vs YSRCP MLA : చిటికేస్తే చాలు - వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ మాస్ వార్నింగ్ ! అసలేం జరిగిందంటే ?
నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యేకు నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.
TDP MLA Balakrishna Vs YSRCP MLA : నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకుడు అలాగే ఉండాలని.. నీచానికి దిగజారకు అని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. దీనికి కారణం నర్సరావుపేటలో జరిగిన ఓ ఘటనే కారణం. బాలకృష్ణ పాటకు డాన్సులేశారన్న కారణంగా ఓ యువకుడ్ని ఎమ్మె్ల్యే శ్రీనివాస్ రెడ్డి వేధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానిక ప్రయత్నింారు. ఈ అంశం సంచలనం అయింది. ఈ ఘటన గురించి బాలకృష్ణకు తెలియడంతో ఆయన కూడా ఎమ్మెల్యే తీరుపై సీరియస్ అయ్యారు.
సినిమాలు వేరు రాజకీయాలు వేరన్న బాలకృష్ణ
సినిమాలు వేరు,రాజకీయాల వేరని.. అన్ని పార్టీల వాళ్లు తన సినిమాలు చూస్తారని బాలకృష్ణ అన్నారు. సినీ నటులకు అన్ని వర్గాల్లో అభిమానులు ఉంటారు మళ్లీ ఇలాంటివి పునర్వతం కాకుండా చూడాలని బాలకృష్ణ హెచ్చరించారు. రాజకీయాలకు సినిమాలను ముడిపెట్టొద్దు.. నరసరావుపేటలో నా పాట వేశారని ఓ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారు.. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకోను.. సినిమాను సినిమాలాగా చూడాలన్నారు. తెనాలి పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరగగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంలో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జాగ్రత్త.. హెచ్చరిస్తున్నా.. చిటిక వేస్తే చాలు.. నేను మూడో కన్ను తెరిస్తే’ అని బాలయ్య మాస్ వార్నింగ్ ఇవ్వడంతో అక్కడున్న ఆయన అభిమానులు ఈలలు వేశారు.
శివరాత్రి ప్రభల వద్ద బాలకృష్ణ పాటలు పెట్టి డాన్సులు వేశారని ఎమ్మెల్యే ఆగ్రహం
నర్సరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేటలో శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ల కోసం ప్రభను రూపొందించారు. ప్రభ నిర్మాణానికి పార్టీలకతీతంగా భక్తులు విరాళాలు ఇచ్చారు. ప్రభ వద్ద డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ హీరో బాలకృష్ణ పాటలు పెట్టి డాన్స్ చేశారు. ఇలా డాన్సులు చేసిన వారిలో భాస్కర్ రెడ్డి అనే యువకుడు ఉన్నారు. భాస్కర్ రెడ్డి బాలకృష్ణ పాటలకు డాన్స్ చేశారని వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన గోపిరెడ్డి.. భాస్కరరెడ్డిని మందలించారు. మనస్తాపానికి గురైన భాస్కరరెడ్డి ఎమ్మెల్యే ఇంటివద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. అక్కడే ఉన్న పోలీసులు, కార్యకర్తలు భాస్కరరెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు భాస్కరరెడ్డిని ఇంటికి తరలించారు.
ఎమ్మెల్యే వేధించింది వైసీపీ కార్యకర్తనే !
భాస్కర్ రెడ్డి వైసీపీ కార్యకర్త. ఎమ్మెల్యేను నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్నానని ఆయన చెబుతున్నారు. తాను టీడీపీ పాటలు ప్రదర్శించలేదని, సినిమా పాటలే పెట్టానని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదన్నారు. ఎమ్మెల్యే తనను తప్పు పట్టడంవల్లే మనస్తాపం చెందినట్టు భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. ఈ అంశం మీడియాలో హైలెట్ కావడంతో బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.