Nagababu About RGV: ఏ పనికిమాలిన వెధవ ఆర్జీవీకి హాని తలపెట్టడు, నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Nagababu Reaction On Ram Gopal Varma: ఏపీ డీజీపీ ఆఫీసుకు వెళ్లి తనకు ప్రాణహాని ఉందని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. దీనిపై నటుడు, జనసేన నేత నాగబాబు తనదైన శైలిలో స్పందించారు.
Ram Gopal Varma: టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాం గోపాల్ వర్మ (Tollywood Director RGV) తల నరికి తెచ్చిన వారికి రూ.1 కోటి నజరానా అని అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన వ్యూహం సినిమా దర్శకుడు (Vyuham Movie Director) రాం గోపాల్ వర్మ పోలీసులను ఆశ్రయించాడు. తొలుత సోషల్ మీడియాలో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవీ బుధవారం సాయంత్రం ఏపీ డీజీపీ ఆఫీసుకు వెళ్లి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ ఆర్జీవీ చేసిన ఫిర్యాదుపై నటుడు, జనసేన నేత నాగబాబు (Nagababu About RGV) తనదైన శైలిలో స్పందించారు. మీరేం భయపడకండి, మీ జీవితానికి ఏ డోఖా లేదు అంటూ వర్మకు హామీ ఇచ్చారు.
ఆర్జీవీపై ఆ వ్యాఖ్యల్ని ఖండించిన నాగబాబు
RGVపై కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల్ని జనసేన నేత నాగబాబు తప్పుపట్టారు. అలాంటి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే కమెడియన్ ను ఎవరూ చంపరంటూ RGVని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కనుక మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదంటూ డైరెక్టర్ వర్మకు నాగబాబు హామీ సైతం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో... ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన ఎధవ మీకెటువంటి హాని తలపెట్టడు అన్నారు నాగబాబు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా అని లాజిక్ పాయింట్ తీశారు. కనుక రాం గోపాల్ వర్మ.. మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి అని వ్యూహం సినిమా దర్శకుడు వర్మకు నాగబాబు సూచించారు. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు అని తన ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. నాగబాబు చేసిన ఈ సోషల్ పోస్టుకు విపరీతమైన స్పందన వస్తోంది. వర్మకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారంటూ నాగబాబు ఫాలోయర్లు కొందరు కామెంట్లు చేస్తున్నారు.
పోలీసులకు వర్మ ఫిర్యాదు, చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్
తనను చంపేందుకు నజరానా ప్రకటించిన కొలికపూడి శ్రీనివాసరావుపై, ఆయనను రెచ్చగొట్టేలా మాట్లాడిన యాంకర్ సాంబశివరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసులను కోరారు. దర్శకుడు వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ చుట్టూ వివాదాలు నడుస్తూ ఉన్నాయి. చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా ఈ సినిమా తెరకెక్కించారని, ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లో అమరావతి ఉద్యమం నేత కొలికిపూడి శ్రీనివాసరావు ఆర్జీవీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. RGV తల తీసుకువస్తే కోటి రూపాయల నజరానా ఇస్తానంటూ పదేపదే అన్నారు. దీనిపై స్పందించిన ఆర్జీవీ బుధవారం డిజిపి కార్యాలయానికి వెళ్లి.. తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోలికపూడి శ్రీనివాసరావుపై డిజిపికి ఫిర్యాదు చేశారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నారా లోకేశ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ నారా లోకేశ్ కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. ఆర్జీవి వ్యూహం మూవీలో చంద్రబాబు, లోకేశ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా చూపించారంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు.