(Source: ECI/ABP News/ABP Majha)
MLC C Ramachandraiah : టీడీపీ ఆఫీసులో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య - పార్టీ మారిపోతున్నారా ?
TDP : ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కనిపించారు. పార్టీ మారుతున్నారా లేదా అన్నదనిపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.
MLC C Ramachandraiah was seen at the Telugu Desam Party office : వైసీపీ నాయకులు ఒక్కొక్కరు పార్టీ మారిపోతున్నారు. సీనియర్ నే, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. తెలుగుదేశం పార్టీలో సి. రామచంద్రయ్య చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నుంచి బలిజ నేతగా, సీనియర్ నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు సి. రామచంద్రయ్య దూరంగా ఉంటున్నారు. ఆయనను వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కడప నుంచి విజయసాయిరెడ్డి బంధువులు టీడీపీలో చేరడానికి వచ్చిన సమయంలోనే టీడీపీ కార్యాలయంలో సి. రామచంద్రయ్య కనిపించడంతో త్వరలో ఆయన సైకిలెక్కబోతున్నారనే ప్రచారం మొదలైంది. కడప జిల్లా రాజంపేట నియోజవకర్గంకు చెందిన సి. రామచంద్రయ్య 1981లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు మంత్రిగా కూడా పని చేశారు. వివిధ పార్టీలో చేరి కీలక పదవుల్లో పని చేశారు.
టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన సి. రామచంద్రయ్య జగన్ పై విమర్శలు గుప్పించారు. ఏపీ మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని అన్నారు. ఏమి చేసినా జగన్ చేసిన అప్పులు తీరవని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి జగన్‌కు చెప్పినా వినే పరిస్థితి లేదని అన్నారు. తనలాగే వైపీసీలో ఇంకా ఎంతో మంది ఉన్నారని, సమయానుకూలంగా వారు కూడా బయటకు వస్తారని చెప్పారు. టీడీపీలో చేరేందుకే చంద్రబాబుని కలిశానని అన్నారు. తనకు పదవుల కంటే సమాజమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. టీ తెలుగుదేశంలో చేరేందుకే చంద్రబాబుని కలిశానని.. పదవుల కంటే సమాజమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించానన్నారు.
రామచంద్రయ్య తొలుత చార్టర్డ్ అకౌంటెంట్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎదగగలిగారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన పెద్ద నాయకుల్లో రామచంద్రయ్య ఒకరు. జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సి. రామచంద్రయ్య కూడా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ సి.రామచంద్రయ్యకు హామీ ఇచ్చారు. గత కొంతకాలంగ పాటు సి. రామచంద్రయ్య వైసీపీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సి.రామచంద్రయ్యను జగన్ పెద్దలకు సభకు పంపారు. గతంలో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం అయిన తర్వాత సి. రామచంద్రయ్య ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఇప్పుడు టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది.
కడప జిల్లాలో వరుసగా నేతలు టీడీపీలో చేరుతూడటంతో.. ఆ జిల్లాలో ఏం జరుగుతుందోనని రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమయింది. సీఎం జగన్ నేతలను పార్టీ మారకుండా కట్టడం చేయలేకపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది .