అన్వేషించండి

Minister Gummadi sandya rani: మంత్రి సంధ్యారాణి కొడుకుపై వచ్చిన ఆరోపణల్లో ట్విస్ట్ - మహిళలే కుట్ర చేసినట్లు నిర్దారణ -అరెస్ట్

Sandhya Rani son: ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ, ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణల కేసులో పోలీసులు సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు.కుట్ర చేసినట్లుగా గుర్తించి మహిళల్ని అరెస్టు చేశారు .

Minister Sandhya Rani son Case: ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాజీ వ్యక్తిగత సహాయకుడు  సతీష్,  ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో వీరు కోట్లాది రూపాయలు వసూలు చేశారంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారం వెనుక త్రివేణి అనే మహిళ ,  సాలూరు మున్సిపల్ ఉద్యోగి దేవిశ్రీ ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. మంత్రి ప్రతిష్టను దిగజార్చేందుకు తప్పుడు ఆధారాలను సృష్టించి పోలీసులను, ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎస్పీ వెల్లడించారు.        

మంత్రి కుమారుడి పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్స్              

ఈ కేసులో ప్రధాన ట్విస్ట్ ఏమిటంటే, నిందితులు వాడిన సాంకేతిక పరిజ్ఞానం. మంత్రి పిఏ సతీష్ ,  ఆమె కుమారుడి పేర్లతో ఫేక్ వాట్సాప్ అకౌంట్లు సృష్టించి, వారే స్వయంగా చాటింగ్ చేసుకున్నట్లుగా స్క్రీన్ షాట్లను నిందితులు రూపొందించారు. ఈ స్క్రీన్ షాట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా, అవి కృత్రిమంగా సృష్టించినవని (Fake Screenshots) శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది. డబ్బులు డిమాండ్ చేసినట్లుగా ఉన్న చాటింగ్ అంతా ఫోటోషాప్ ,  ఇతర యాప్‌ల ద్వారా సృష్టించిన మాయాజాలమని పోలీసులు ప్రాథమిక ఆధారాలను కనిపెట్టారు.   

మున్సిపల్ ఉద్యోగిని సాయంతో  మహిళ కుట్ర                    

నిందితురాలు త్రివేణి గతంలో కూడా పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాలూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న దేవిశ్రీ ఆమెకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ నాటకానికి తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న తదుపరి, వారు ఏ విధంగా ఈ ఫేక్ చాట్స్ క్రియేట్ చేశారో పూర్తి ఆధారాలను సేకరించారు.                  

సాక్ష్యాలను సేకరించిన పోలీసులు                                 

తప్పుడు ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బురద జల్లడమే కాకుండా, ఫోరెన్సిక్ నివేదికలో నిజాలు బయటపడటంతో పోలీసులు త్రివేణి ,  దేవిశ్రీలను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా మాస్టర్ మైండ్స్ ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారిపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హెచ్చరించారు.                                              

టాప్ హెడ్ లైన్స్

YSRCP 70 Constituency Incharges Change : 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. ఆర్థిక బలవంతులు దొరుకుతారా?
70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. ఆర్థిక బలవంతులు దొరుకుతారా?
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
బాబా వాంగ 2026 అంచనాలు: ఇయర్ ఎండ్ మీ రాశికి సంక్షోభమా, సంపదా?
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
Embed widget