(Source: ECI/ABP News/ABP Majha)
Gummanur Jayaram : టీడీపీలోకి మంత్రి గుమ్మనూరు జయరాం - ఆ సీటు ఖరారు చేశారా ?
Gummanur Jayaram : మాంత్రి గుమ్మనురు జయరామ్ పార్టీ మారుతున్నారా ? టీడీపీ పార్టీ నుంచి ఆ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారా ?
Minister Gummanur Jayaram to join TDP : మంత్రి గుమ్మ నూరు జయరాం వ్యవహారం కర్నూలు జిల్లా వైసీపీని కలవరపెడుతోంది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి గుమ్మునురు జయరాం వైస్సార్సీపీ పార్టీ కి దూరం అవుతున్నారని జిల్లా లో గట్టిగా వినిపిస్తోంది. త్వరలో సొంత గూడు తెలుగుదేశం పార్టీలో చేరుతానే వార్తలు కొద్దీ రోజులు నుంచి చక్కర్లు కొడుతునప్పటికి మంత్రి గుమ్మ నూరు జయరాం కానీ.. ఆయన అనుచరులు కానీ ఎక్కడా ఖండించలేదు. దీంతో పార్టీ మార్పు ఖాయంగా కనిపిస్తుందని చెబుతున్నారు.
గుమ్మనూరును పట్టించకోని వైసీపీ హైకమాండ్
వైసీపీ పార్టీ అధిష్టానం కూడా మంత్రి గుమ్మనూరు జయరాం పై పెద్ద గా ఫోకస్ పెట్ట లేదని చర్చించుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం అభ్యర్థుల మార్పులు చేర్పుల బాగంగా ఆలూరు నియోజకవర్గం వైస్సార్సీపీ పార్టీ ఇంచార్జి గా విరుపాక్షిని నియమించారు. మంత్రి గా ఉన్న జయరామ్ కు కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు. అయితే తన ప్రత్యర్థికి టికెట్ ఇవ్వొద్దని చెబుతూనే వచ్చారు.అంతేగాక పార్లమెంటు అభ్యర్థి గా పోటీ చేసేందుకు గుమ్మ నూరు ఆసక్తి చూపలేదు. మళ్ళీ ఆలూరు టికెట్ తనకే ఇవ్వాలని పట్టు పట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్వహించిన పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ అధిష్టానం ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రాలేదు. గుమ్మనూరు మాత్రం ఆలూరు టికెట్ కోసం పట్టు విడలేదు. దీనికి తోడు చివరి క్యాబినెట్ మీటింగ్ కు వెళ్ళి తన మనసులో మాట జగన్ చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది.
కర్నూలుకు వచ్చిన సీఎంను కలిసి మరోసారి చెప్పినా దొరకని ఊరట
అంతేగాక కర్నూలు పార్లమెంటు అభ్యర్థి గా మరొకరికి అవకాశం ఇస్తున్నట్లు సోషల్ మీడియా కు లీక్ చేసింది. ఇలాంటి గందరగోళ పరిస్తితిలో ముఖ్యమంత్రి జగన్ కర్నూలు కు వచ్చారు. మంత్రి గుమ్మ నూరు జయరాం జగన్ ను కలిశారు. అంతలోనే ఆలూరు నియోజకవర్గం లో ఓ గ్రామానికి రోడ్డు అభివృద్ది పనులను మంత్రి గుమ్మ నూరు శ్రీకారం చుట్టారు. అంతకు ముందే అదే రహదారినీ ప్రస్తుత ఇంఛార్జి విరుపాక్షీ శ్రీకారం చుట్టారు.. అయితే మంత్రి గుమ్మ నూరు జయరాం ఇంఛార్జి ను నుద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపాయి. మళ్ళీ టికెట్ తనకే వస్తుందనెలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన పార్టీ మారడం లేదనే సంకేతాలు ఇచ్చారు. పార్టీలో గుమ్మ నూరు జయరాం ఆక్టివ్ కావడంతో ఆయన పార్టీ మారడం లేదని టాక్ నడిచింది. అయితే సడెన్ గా అనంతపురం జిల్లా రాప్తాడు లో వైసీపీ నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు మంత్రి గుమ్మనూరు జయరాం హాజరు కాకపోవడం తో మళ్లీ ఆయన పార్టీకి దూరమవుతున్నారని గట్టిగానే చర్చ నడుస్తోంది. సత్యసాయి జిల్లాకు ఇన్చార్జిగా ఉన్న గుమ్ము నూరు జయరాం సిద్ధం బహిరంగ సభకు వెళ్లకపోవడంతో ఆయన అసంతృప్తి మళ్ళీ బయటపడింది.. గతంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పుట్టపర్తి కి వచ్చినప్పుడు జయరామ్ హాజరుకాలేదు.
టీడీపీ గుంతకల్లు టిక్కెట్ ఆఫర్ చేసిందా ?
రాప్తాడులో సీఎం పాల్గొన్న సిద్ధం సభకు గుమ్మనూరు జయరాం హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నరని నియోజ వర్గంలో స్పష్టం అయింది. టిడిపి లో వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. జయరాం కు అనంతపూర్ జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్ దాదాపు ఖరారు అయినట్టే అంటూ నియోజకవర్గం మొత్తం చర్చ నడుస్తోంది. అంతేగాక గుమ్మనూరు జయరాం రహస్యంగా ఆలూరు నియోజకవర్గంలోని ముఖ్య నేతలను పిలిపించుకొని సమావేశమయినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆయన భవిష్యత్తు కార్య చరణ పై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈనెల 23న పార్టీకి తన పదవికి రాజీనామా చేసి టిడిపి కండువా కప్పు కుంటున్నారని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తుంది. మంత్రి గుమ్మనురు జయరామ్ ని abp ప్రతినిధి సంప్రదించగా.. గుమ్మనురు జయరామ్ ఎంపీ గా పోటీ చేయడు.. ఎమ్మెల్యే గానే పోటీ చేస్తాడు అని చెప్పడం జరిగింది. అది వైసీపీ పార్టీ నుంచి బరిలో ఉంటారా లేక టీడీపీ నుంచి బరిలో ఉంటారా అన్నది మరో నాలుగు, ఐదురోజుల్లో తేలిపోనుంది.