Sarkaru Vaari Paata Dialogue : సూపర్ స్టార్ నోట సీఎం జగన్ డైలాగ్, సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న అభిమానులు
Sarkaru Vaari Paata Dialogue : 2019 ఎన్నికల ప్రచారంలో మారుమోగిన 'నేను విన్నాను. నేను ఉన్నాను' ఇప్పుడు సిల్వర్ స్ర్కీన్ పై వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు నోట జగన్ డైలాగ్ రావడంతో వైసీపీ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Sarkaru Vaari Paata Dialogue : ఏపీ రాజకీయాల్లో ఆ డైలాగ్ చాలా ఫేమస్. 2019 ఎన్నికల ప్రచారంలో మారుమోగిన డైలాగ్. సీఎం జగన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే డైలాగ్స్ లో మొదటిది ఇదే. అదే 'నేను విన్నాను... నేను ఉన్నాను'. ఈ డైలాగ్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో మారుమోగుతోంది. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' డైలాగ్ పై ఇప్పుడెందుకు ఇంత చర్చ అంటారా. అసలు విషయం సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా సర్కారు వారి పాటలో ఉంది. ఇవాళ సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో మహేశ్ బాబు హీరోయిన్ కీర్తి సురేశ్ తో 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే డైలాగ్ చెబుతాడు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఈ డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు.
"నేను విన్నాను.. నేను ఉన్నాను.." సర్కారు వారి పాట ట్రైలర్ లో జగనన్న డైలాగ్.. pic.twitter.com/8e0HLOLGuq
— Inturi Ravi Kiran (@inturiravikiran) May 2, 2022
సర్కారు వారి పాట ట్రైలర్ విడుదల
కొందరు అభిమానులు జగన్ మాట్లాడిన డైలాగ్, మహేశ్ బాబు డైలాగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా చెప్పిన డైలాగ్ అని కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఇది వైఎస్ జగన్‌పై సెటైర్ అని పోస్టులు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఈ మూవీ మే 12న విడుదల కానుంది. ఇవాళ ఈ మూవీ ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ లో మహేశ్ బాబు డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మహేశ్ డైలాగ్స్ వైరల్
సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ లో మహేశ్ బాబు చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. 'నేను విన్నాను. నేను ఉన్నాను' డైలాగ్ అయితే బాగా పేలిందని అభిమానులు అంటున్నారు. 2019 ఎన్నికల ప్రచారం, ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 'నేను విన్నాను. నేను ఉన్నాను' అనే మాటలు ప్రస్తావించారు. అసలు ఈ డైలాగ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వచ్చాయి. ఆయన పాదయాత్ర సమయంలో, తరచూ ఈ మాటలు వాడేవారు. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
నేను విన్నాను!! నేను ఉన్నాను!!
— Amaresh Hugar (@AmareshHugarrr) May 2, 2022
I am from Karnataka but e dialogue vinna ventane YSR sir gurtocharu.
Finally the most awaited trailer is here #SarkaruVaariPaataTrailer https://t.co/Eac8ampWaK#SarkaruVaariPaata #MaheshBabu𓃵 #Superstar #MaheshBabu #SarkaruVaariPaataTrailerDay pic.twitter.com/jE72fyZlir