అన్వేషించండి

Vizag Boat Fire News : పోలీసులు చంపేసేవారు - విశాఖ హార్బర్ అగ్నిప్రమాద ఘటనలో లోకల్ బాయ్ నాని ఆరోపణలు !

Vizag Boat Fire News : విశాఖ పోలీసులపై లోకల్ బాయ్ నాని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై నేరం మోపేందుకు ప్రయత్నించారని కొట్టారని హైకోర్టులో పిటిషన్ వేశారు.


Vizag Boat Fire News  :  విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరింది.. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిపోయిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్‌, లోకల్‌బాయ్‌ నాని.. హైకోర్టు మెట్లు ఎక్కారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు నాని..  ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. 

వేరే ప్రాంతంలో ఫ్రెండ్స్ తో  పార్టీ 

విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో నేను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు నాని.. వేరే ప్లేస్ లో నా స్నేహితులకు పార్టీ ఇచ్చాను.. రాత్రి 11.45 గంటల సమయంలో నాకు బోట్లు తగల బడుతున్నట్టు ఫోన్ వచ్చింది.. దీంతో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా నేను హార్బర్ కు వెళ్లాను.. నేను వెళ్లే సమయానికి బోట్లు తగల బడుతున్నాయి అని తెలిపాడు.. నేను అప్పటికే మద్యం తాగే ఉన్నాను.. నేను హార్బర్ కు వెళ్లేదంతా సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యిందన్నాడు.. అయితే, ఫిషింగ్‌ హార్బర్‌లో ప్రమాదాన్ని వీడియో తీయటం ద్వారా ప్రభుత్వానికి విషయం చెప్పటానికి మాత్రమే నేను ప్రయత్నం చేశాను.. కానీ, వీడియోలు తీస్తున్న నన్ను కొందరు కొట్టే ప్రయత్నం చేశారని.. వీడియో తీసిన తర్వాత నేను కూడా సహాయక చర్యల్లో పాల్గొననా తెలిపాడు.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు వెల్లడించాడు. 

పోలీసులు మూడు రోజుల పాటు నిర్బంధించి హింసించారు ! 

 వీడియో పోస్ట్ చేసిన తర్వాత పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని తెలిపాడు లోకల్‌ బాయ్‌ నాని.. పోలీసు విచారణ కోసం రావాలని కోరటంతో వెళ్లానని హైకోర్టు వద్ద మీడియాకు- తెలిపారు.  పోలీసులు నేను బోట్లు తగల బెట్టానని  నాపై చేయి చేసుకున్నారని ఆరోపిచారు.   నేను ప్రమాదం జరిగే సమయంలో హోటల్ లో ఉన్నాను, ఆ హోటల్ లో సీసీ టీవీ ఫుటేజ్ లో నేను ఉన్నాను.. హోటల్‌లోకి ఎప్పుడు వెళ్లింది.. మళ్లీ ఎప్పుడు బయటకు వచ్చింది అన్నీ ఆ ఫుటేజ్‌లో ఉన్నాయని తెలిపాడు.. కానీ, పోలీసులు మూడు రోజుల పాటు నన్ను నిర్బంధించారు.  గర్భిణి అయిన నా భార్య ఎంతో ఆందోళనకు గురైంది.  ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. నా కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగే ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.. అంతేకాదు.. కోర్టులో పిటిషన్ వేయక పోతే పోలీసులు నన్ను అంతం చేసే వారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబసభ్యులనూ వేధిస్తున్నారని  నాని ఆరోపించారు. 
  
మూడు రోజులు పోలీసుల నిర్బంధంలో లోకల్ బాయ్ నాని 

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న విశాఖ వన్ టౌన్ పోలీసులు.. అగ్నిప్రమాదంపై ఆరా తీశారు.. ఈ అగ్నిప్రమాదానికి నానియే కారణం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో, అతడిని మూడు రోజుల పాటు పోలీసుల అదుపులోనే ఉన్నాడు.. అయితే, నానిని అక్రమంగా పోలీసులు బంధించారని అతని స్నేహితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత పోలీసులు నానిని రిలీజ్‌ చేశారు..  తనను అక్రమంగా నిర్బంధించారని పిటిషన్‌ దాఖలు చేయడంతో.. విశాఖ పోలీసులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. 


ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget