అన్వేషించండి

YSR Kadapa District MLA Candidates List 2024: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు 2024 ఫలితాల్లో కడప జిల్లాను కమ్మేసిన టీడీపీ- 2 చోట్లు మినహా అన్నింటా సైకిల్‌ రైడ్

AP Assembly Election Results 2024: కడప జిల్లాలో వైసీపీకి టీడీపీ చుక్కలు చూపించింది. ఏడు స్థానాల్లో ఐదింటిని కుమ్మేసింది. జగన్‌తోపాటు ఇంకో మహిళా అభ్యర్థి మాత్రమే అక్కడ విజయం సాధించారు.

YSR kadapa District MLA Candidates Winner List 2024:  కడప జిల్లాలో సైకిల్ స్పీడ్‌కి వైసీపీ లీడర్లు కకావికలమైపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు ఎగిరిపోయారు. ఇద్దరు మినహా మిగతావారంతా కౌంటింగ్ ప్రారంభమైన కాసేపటికే అస్సాం ట్రైన్ ఎక్కేశారు. గెలుపు అవకాశాలు లేకపోవడంతో కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఏడు స్థానాల్లో ఐదింటిని ఎగరేసుకుపోయింది టీడీపీ కూటమి. 

నియోజకవర్గం

విజేత 

పార్టీ 

బద్వేలు

డాక్టర్‌ దాసరి సుధ

వైసీపీ

మైదుకూరు

పుట్టా సుధాకర్‌ యాదవ్‌ 

టీడీపీ

కమలాపురం

పుత్తా చైతన్య రెడ్డి 

టీడీపీ

జమ్మలమడుగు

ఆదినారాయణరెడ్డి 

టీడీపీ

పులివెందుల

వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి 

వైసీపీ

ప్రొద్దుటూరు

వరదరాజుల రెడ్డి 

టీడీపీ

కడప

మాధవిరెడ్డి 

టీడీపీ

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా

రాయలసీమలో మరో కీలక జిల్లా వైఎస్‌ఆర్‌ కడప జిల్లా. ఈ జిల్లా తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి, ఆ తరువాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంటూ వస్తోంది. గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్‌, ఆ తరువాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటూ వచ్చింది. ఈ జిల్లాలో కడప పార్లమెంట్‌ స్థానం ఉంది. మొత్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, గడిచిన మూడు ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను టీడీపీయేతర పార్టీలే దక్కించుకున్నాయి.

2009లో కాంగ్రెస్‌ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించగా, 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ మొత్తం స్థానాలను గెల్చుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ మరోసారి ఈ జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేసింది. అలాగే, 2010లో జరిగిన ఉప ఎన్నిక ఏకగ్రీవం కాగా, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ జిల్లాలోని ఓటర్లు తొలి నుంచి వైఎస్‌ఆర్‌కు అండగా ఉంటూ వస్తున్నారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మళ్లారు.

2024 ఎన్నికల్లో పూర్తిగా మారిన రాజకీయం
తాజాగా జరిగిన 2024 ఎన్నికల్లో చాలా వరకు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని, మెజార్టీ స్థానాల్లో తామే విజయం సాధిస్తామన్న ధీమాను టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కుటుంబంలో వచ్చిన చీలిక తమకే మేలు చేస్తుందన్న భావనలో కూటమి నాయకులు ఉన్నారు. ఇదిలా, ఉంటే కడప పార్లమెంట్‌ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవినాష్‌ రెడ్డి బరిలో ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైఎస్‌ఆర్‌ కుమార్తె షర్మిలో పోటీలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి పోటీ చేశారు. ఇదిలా, ఉంటే గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్‌ శాతం పెరిగింది. రెండు శాతానికి మించిన పెరిగిన ఓటింగ్‌ ఎవరికి మేలు చేస్తుందో చూడాల్సి వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాల్లో 77.81 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో 79.57 శాతం మేర పోలింగ్‌ శాతం పెరిగింది. 

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా

2009

2014

2019

బద్వేలు

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

మైదుకూరు

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

కమలాపురం

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

జమ్మలమడుగు

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

పులివెందుల

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

ప్రొద్దుటూరు

టీడీపీ

వైసీపీ

వైసీపీ

కడప

కాంగ్రెస్

వైసీపీ

వైసీపీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
సంధ్య థియేటర్ ఘటన - ఏబీపీ దేశం చొరవతో శ్రీతేజ్ హెల్త్ బులిటెన్‌పై సీపీ, వైద్యుల స్పందన
Embed widget