(Source: Poll of Polls)
Prime Minister Modi: కర్నూలు సభ నుంచి రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులు - ఏపీకి ప్రధాని మోదీ వరాలు
Kurnool Sabha: కర్నూలు సభ నుంచి ప్రధాని 13వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ప్రాజెక్టులు ఉన్నాయి.

Prime Minister launches works worth Rs 13000 crores from Kurnool: కర్నూలులోని నన్నూరు సభ నుంచి రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఇందులో రూ.9,449 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ. 2,276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. కర్నూలులో రూ.2,880 కోట్లతో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్, రూ.493 కోట్లతో కొత్తవలస-విజయనగరం మధ్య 4వ లైన్‌కు, రూ.184 కోట్లతో పెందుర్తి-సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.
#WATCH | Kurnool, Andhra Pradesh: Prime Minister Narendra Modi inaugurates, lays the foundation stone and dedicates to the nation multiple development projects worth around Rs. 13,430 crore
— ANI (@ANI) October 16, 2025
(Source: DD) pic.twitter.com/l5q65dxZjg





















