Budget 2024: ఏపీకి చాలా రోజుల తర్వాత కేంద్ర బడ్జెట్ లో న్యాయం - మాజీ మంత్రి పరిటాల సునీత
Andhra Pradesh News | చంద్రబాబు సీఎం కావడంతో ఏపీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయని, అమరావతి కోసం సాయం చేస్తామని బడ్జెట్ లో చెప్పడమే ఇందుకు నిదర్శనమని పరిటాల సునీత పేర్కొన్నారు.
Paritala Sunitha expressed her happyness over Union Budget 2024 Funds to Amaravati | రాప్తాడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్ల రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని, నేడు కేంద్ర బడ్జెట్ 2024లో ఏపీకి కేటాయింపులే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని అమరావతి నిర్మాణానికి కోట్లు రూ. 15 వేల కోట్లు సాయం అందించేకు ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారని.. ఇది పూర్తైతే రాయలసీమకు కూడా నీటి కష్టాలు తీరే అవకాశం ఉందన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయన్నారు. విభజన చట్టంలో పొందుపర్చినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడం సంతోషం కల్గించిందన్నారు.
రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయించడం వలన ఈ ప్రాంతాల్లో ఉన్న కష్టాలు కొంతైనా తీరుతాయన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాకు ఈ నిధులు ఎంతో అవసరం అని ఆమె అభిప్రాయపడ్డారు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు కేటాయిస్తే.. ఇక రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. కేంద్రం ఈ విధంగా సాయం ప్రకటించడం వెనుక చంద్రబాబు ప్రయత్నం ఉందని.. ఒక మంచి నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ఇలా మంచి జరుగుతుందని సునీత అన్నారు.