(Source: Poll of Polls)
Nandyal Kidnap: ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన బెస్ట్ ఫ్రెండ్స్! విచారణలో విస్తుపోయే నిజాలు!
Telugu News: కిడ్నాప్ కు గురైన విద్యార్థి స్నేహితులు నలుగురిని పోలీసులు విచారణలోకి తీసుకోగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. స్నేహితులతో తలెత్తిన గొడవ కిడ్నాప్, దాడి చేసే పరిస్థితికి దారి తీసింది.
Nandyal Kidnap Latest News: నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్థానిక కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థి వహీద్ కిడ్నాప్ తీవ్ర కలకలం రేపుతోంది. వహీద్ ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాలేజీకి వెళ్లిన వహీద్ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో వహీద్ తల్లిదండ్రులు చుట్టుపక్కల కాలేజీ పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వై స్నేహితులను విచారించినప్పటికీ వారు తెలియదు అనడంతో వహీద్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో తమ కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు అందించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
ఆత్మకూరు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న వహీద్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీ ఫిర్యాదులో వహితు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని దీంతో జనసేన పార్టీకి చెందిన నలుగురితో చాలా సన్నిహితంగా తిరుగుతూ ఉండేవాడని ఆ నలుగురు పైనే తమకు అనుమానంగా ఉందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని నాలుగో బృందాలుగా విడిపోయి వహీద్ ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు.
స్నేహితులే కిడ్నాపర్లు
ఆత్మకూరు పట్నం చిరకాల కాలనీలో నివాసం ఉంటున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నలుగురు వహీద్ కు స్నేహితులు. పోలీసు విచారణలో విస్తు పోయే నిజాలు వెల్లడయ్యాయి. వహిద్ కు స్నేహితులతో తలెత్తిన గొడవ కిడ్నాప్, ఆపై దాడి చేసే పరిస్థితికి దారి తీసింది. నిందితులు అదుపులో ఉన్నప్పటికీ వహీద్ ఆచూకీ ఇప్పటివరకు తెలియ రాలేదు. వహిద్ మూడు రోజులుగా అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ ను ఆశ్రయించారు. తమ కుమారుడు కావాలంటూ పోలీసు స్టేషన్ వద్దే మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. కుమారుడి ఆచూకీ లభించక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వహీద్ ఆచూకీ తెలిసే వరకు పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చుంటామంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.