అవినాష్ రెడ్డి తల్లి పరిస్థితి విషమం- లక్ష్మి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన వైద్యులు
కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమెకు నాన్ ST ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ అటాక్) ఉందని పేర్కొన్నారు. ఆమె యాంజియోగ్రామ్ డబుల్ నాళాల వ్యాధితో బాధపడుతున్నారన్నారు. ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షణలో CCUలో ఉన్నారని వివరించారు. ఆమె రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉందని, ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌లో ఉందన్నారు.
ప్రస్తుతం వాంతులు అదుపులోకి వచ్చాయని నోటితో శ్వాస తీసుకోవడం కూడా తగ్గిందన్నారు. అల్ట్రాసౌండ్ చేసి ఉదరం, మెదడు ఇమేజింగ్ ప్లాన్ చేస్తున్నామమన్నారు వైద్యులు. ఆమెకు బిపి తక్కువగా ఉన్నందున మరికొన్ని రోజులు ఐసియులో ఉండవలసి ఉందన్నారు.
శుక్రవారం ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి బయల్దేరుతుంటగానే లక్ష్మి కళ్లు తిరిగి పడిపోయారు. తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు రాలేనని చెప్పి పులివెందుల బయల్దేరి వెళ్లారు.
ఆమెను పులివెందులలోనే ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లాల్సిన అవినాష్ రెడ్డి రూట్ మార్చి పులివెందులకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కర్నూలు, డోన్ మీదుగా గుత్తికి చేరుకున్నారు. అయితే లక్ష్మమ్మకు మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో ఆమెను హైదరాబాదుకు తరలిస్తుండగా.. . తల్లితో పాటు అవినాష్ రెడ్డి వెళ్తారని అంతా భావించారు. కర్నూలు నగరానికి రాగానే అంబులెన్స్‌ను గాయత్రి ఎస్టేట్‌కు మళ్లించి విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ అస్పత్రిలో చేర్పించడం తెలిసిందే.
హైదరాబాద్ వస్తున్న క్రమంలో లక్ష్మి ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు చెప్పడంతో పక్కనే ఉన్న కర్నూలు విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ అసుపత్రికి తరలించారు. శుక్రవారం నుంచి అక్కడే ఉంచి చికిత్స అందిస్తున్నారు.