By: ABP Desam | Updated at : 10 Feb 2022 10:59 PM (IST)
ఉదయం సైకిల్ ఎక్కిన హరనాథ్ రెడ్డి సాయంత్రానికి వైసీపీ కండువాతో ఇలా
కర్నూలు జిల్లా డోన్‌లో రాత్రికి రాత్రే ఓ పెద్ద డ్రామా నడిచింది. రాష్ట్రఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy) ముఖ్య అనుచరుడు హరనాథ్ రెడ్డి(Hranath Reddy) కర్నూలులో తెలుగుదేశం పార్టీలో స్వచ్చందంగా చేరారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బేతంచెర్లలో సభకు వెళుతుండగా మార్గ మధ్యలో డోన్ పోలీసులు అడ్డుకుని హరనాథ్ రెడ్డిపై మిస్సింగ్ కేసు ఉందంటూ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి డోన్ పట్టణము పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డోన్ పోలీస్ స్టేషన్ కు భారీగా తరలివచ్చారు.
భర్త హరనాథ్ రెడ్డిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు మేరకు అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చామని పోలీసులు చెప్పారు. హరనాథ్ భార్యను అడిగితే తాను అలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. హరనాథ్ రెడ్డి కిడ్నాప్ అయ్యాడని అయన తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు.
హరినాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ(TDP)లో చేరడం కొంతమంది వైస్సార్సీపీ నాయకులు జీర్ణించుకోలేక పోలీస్‌లపై ఒత్తిడి చేసి ఎట్టకేలకు వైసిపి కండువా కప్పేశారన్నా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే పగలు తెలుగుదేశం పార్టీలో చేరిన హరనాథ్ రెడ్డి రాత్రి పెద్దనాటకీయ పరిణామాల మధ్య పోలీసుల జ్యోక్యంతో తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పగలు తెలుగుదేశం పార్టీలో చేరి రాత్రి వైసీపీలో చేరడంపై ప్రజల్లో కాస్తా చర్చలకు దారితీసేవిందంగా కన్పిస్తోంది.
హరనాథ్ రెడ్డి తండ్రి ధారప్రతాప్ రెడ్డి మద్దిలేటిస్వామి ఆలయంలో కమిటీ మెంబర్ గా కొనసాగితున్నారు. అయితే ఒక్కసారిగా తనకుమారుడు హరినాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరటంతో డోన్ వైసీపీ(YSRCP)లో దుమారం రేగింది. దీంతో వైసీపీ శ్రేణులు చాకచక్యంతో వ్యవహరించి హరనాథ్ రెడ్డిని టీడీపీ శ్రేణులు కిడ్నాప్ చేసినట్లు హైడ్రామా క్రియేట్ చేశారని తెలుస్తోంది.స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు కేసులు పెడతామని బెదిరించారా? అందువల్లే తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారని చర్చలు జరుగుతున్నాయి. హైడ్రామా మధ్య వైసీపీలో చేరిన హరనాథ్ రెడ్డి మరికొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికైనా టీడీపీలోకి వస్తారని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.
బేతంచెర్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 6 వార్డులను గెలుచుకుంది. గెలిచిన వార్డ్ కౌన్సిలర్ ను బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారని ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై మండిపడుతున్నారు. హరనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరికతో చెల్లుకు చెల్లుగా తామేమీ తక్కువ కాదంటు డోన్ నియోజకవర్గ ఇంచార్జ్ సుబ్బారెడ్డి బదులిచ్చారు. ఏది ఏమైనా ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఆశలు చిగురించాయని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వైసీపీ ప్రత్యర్ధులపై కేసులు పెట్టె ధోరణిని ప్రజలు ఏకీభవిస్తారా?.. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి తీర్పు చెపుతారో వేచి చూడాల్సిందే.
Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
కౌబాయ్ గెటప్‌లో కర్నూలు ట్రాఫిక్ పోలీస్-కొత్త లుక్‌లో విధులు
TDP Women Leaders : అన్ని పార్టీల మహిళా నేతలతో కలిసి ప్రభుత్వం ఉద్యమం - గోరంట్ల ఇష్యూలో టీడీపీ దూకుడు !
AP Home Minister : ఎంపీ ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ -ఎంపీ మాధన్ వీడియోపై ఏపీ హోంమంత్రి స్పందన !
ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు
Rana Daggubati : అన్నీ డిలీట్ చేసిన రానా - ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు
CA Result: నేడే సీఏ ఫౌండేషన్ ఫలితాలు, ఇక్కడ చూసుకోండి!
Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు
Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!