Tadipatri Latest News: తాడిపత్రిలో హైటెన్షన్- వైసీపీ మీటంగ్‌కు బయల్దేరిన పెద్దారెడ్డి- అడ్డుకున్న పోలీసులు
తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అక్కడ జరిగే వైసీపీ సమావేశానికి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు అనుమతి ఉన్నా వెళ్లనీయకపోవడం ఏంటని మాజీ ఎమ్మెల్యే మండిపడుతున్నారు.

Tadipatri Latest News: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయన్ని హౌస్ అరెస్టు చేశారు. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.తాడిపత్రిలో విస్తృతస్థాయి సమావేం ఏర్పాటు చేసిన పెద్దారెడ్డి అక్కడకు వెళ్లేందుకు యత్నించారు. ఆయన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. సొంతూరులోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఆ సమావేశానికి ఆయన తప్ప మిగతా నేతలంతా హాజరుకావచ్చని పోలీసులు చెబుతున్నారు.
శాంతిభద్రతల సమస్య వస్తుందన్న పోలీసులు
తాడిపత్రి సమావేశానికి పెద్దారెడ్డి వస్తే గొడవలు జరుగుతాయని శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని పోలీసులు చెబుతున్నారు. అందుకే కోర్టు అనుమతి ఉన్నప్పటికీ తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని వివరిస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సహకరించాలని ఆయన్ని కోరారు. ఎలాగైనా వెళ్తానని పట్టుబట్టంతో పెద్దారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు.
అడ్డుకోవడంపై పెద్దారెడ్డి ఆగ్రహం
పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తనను వెళ్లనీయకపోవడంపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎలాంటి వివాదాల జోలికి వెళ్లబోనని చెప్పినా, కోర్టు అనుమతి ఉన్నప్పటికీ అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఇంటి నుంచి బయల్దేరిన పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు కారు ఎక్కారు. ఆ కారును ఇంటి గేటు కూడా దాటనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కారులో ఉండి కాసేపు ఎదురు చూశారు.
తాడిపత్రిలో టైట్ సెక్యూరిటీ
మరోవైపు తాడిపత్రిలో కూడా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడంలో నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. బాబు మేనిఫెస్టో రీకాల్ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు ఈ సమావేశంలో చర్చిందేకు నేతలు సిద్ధమయ్యారు. తాను కూడా వస్తున్నట్టు పెద్దారెడ్డి చెప్పడంతో వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. అందుకే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాడిపత్రిలో పరిస్థితిపై జగన్ ఆందోళన
రెండు రోజుల క్రితం ప్రెస్‌మీట్ పెట్టిన వైసీపీ అధినేత జగన్ తాడిపత్రిలో జరుగుతున్న రాజకీయ వివాదంపై స్పందించారు. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేతను అక్కడకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు.
జగన్‌కు కౌంటర్ ఇచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి రాజకీయాలపై స్పందించిన జగన్మోహన్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేతిరెడ్డి పార్టీకి చీడ పురుగు లాంటివారని ఆరోపించారు. పెద్దారెడ్డి విషయంలో తగ్గేదేలే అన్నారు. ైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎవరింటికీ వెళ్లేలేదని కానీ ఆయన మా ఇంటికి వచ్చారని ప్రశ్నించారు. జగన్ తాత చనిపోయిన రోజు పులివెందుల మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉందని కేతిరెడ్డి ఫ్యామిలీ అడుగు పెట్టగానే విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. ఇలాంటివి గుర్తు లేకపోతే విజయమ్మను అడగాలని సూచించారు.





















