అన్వేషించండి

Minister Venugopala Krishna : అయ్యన్న పాత్రుడు అరెస్టుపై కుల రాజకీయాలు, టీడీపీపై మంత్రి వేణు గోపాల కృష్ణ ఫైర్

Minister Venugopala Krishna : అయ్యన్న పాత్రుడు చేసిన తప్పులకు శిక్ష తప్పదని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అన్నారు. అయ్యన్న అరెస్టుతో కులరాజకీయాలు చేస్తున్నారన్నారు.

Minister Venugopala Krishna : అయ్యన్నపాత్రుడు అరెస్ట్ ను బీసీల అణచివేతగా వక్రీకరిస్తున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ టీడీపీపై మండిపడ్డారు.  డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైసీపీ కార్యాలయంలో మంత్రి వేణు గోపాల కృష్ణ మీడియాతో మాట్లాడారు.  టీడీపీ మాజీ మంత్రి  అయ్యన్నపాత్రుడు చేసిన తప్పు వల్లే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని, ఆ అరెస్ట్ ను వక్రీకరించి కుల రాజకీయాలు చేయాలని టీడీపీ చూస్తుందని బీసీ సంక్షేమ శాఖ, సినిమాటోగ్రఫీ సమాసర శాఖ మంత్రి చెల్లుబోయిన  వేణుగోపాల కృష్ణ తీవ్ర స్థాయిలో ఖండించారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన తప్పులకు శిక్ష తప్పదని, తప్పు చేస్తే ఎంతటి వారైనా పోలీసుల నుంచి తప్పించుకోలేరని అన్నారు.

చట్టం ముందు ఎవరైనా ఒక్కటే 

అయ్యన్న పాత్రుడు టీడీపీ పాలనలో చేసిన తప్పులు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయని, అంతేకాని బీసీలను తొక్కేస్తున్నారు అని, కళ్లబొల్లి కబుర్లు చెప్పొద్దు అని మంత్రి అన్నారు. చట్టం ముందు ఎవరైనా ఒకటే అని బీసీలు అయితే ఒక చట్టం, ఇంకో వర్గం అయితే మరో చట్టం చేశారా అని చంద్రబాబు నాయుడుని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో చేసిన అన్యాయలు అక్రమాలు ఒక్కొకటి వెలుగులోకి వస్తున్నాయన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, సిగ్గు లేకుండా తప్పు చేసిన వారిని కాపాడటానికి బీసీలను అడ్డుపెట్టుకుంటున్నారని టీడీపీ నాయకులపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. 

అయ్యన్న సత్యశీలుడా? 

"చంద్రబాబు, టీడీపీ నేతలు అనేక సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు అరెస్టును బీసీలపై దాడిగా టీడీపీ ఆపాదిస్తుంది. దీనిని మేం ఖండిస్తుంది. పోలీసులు పెట్టిన కేసుల్లో ఎలాంటి తప్పు చేయకపోతే అయ్యన్న నిరూపించుకోవాలి. అంతేకానీ అరెస్టుతో కులరాజకీయాలు చేస్తున్నారు. అయ్యన్న ఏదో సత్యశీలుడిగా చంద్రబాబు చెబుతున్నారు. పోలీసులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. అయ్యన్నపై గంజాయి, లేటరైట్, బాక్సైట్ అక్రమ తవ్వకాలతో సహా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి." - మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ

తప్పు చేస్తే అరెస్టు చెయ్యరా- ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ 

 తప్పు చేసిన అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేస్తే టీడీపీ నాయకులు రచ్చ చేస్తున్నారని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. గత మూడున్నరేళ్లగా కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే బీసీ నాయకుడిని అరెస్టు చేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడడం సమంజసమేనా అని ప్రశ్నించారు. బీసీ నాయకులు తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా అని అన్నారు. తానూ బీసీ నాయకుడినే.. తాను తప్పు చేస్తే అరెస్టు చేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు రోడ్ల మీదకు వచ్చి బీసీ నేతను అరెస్టు చేశారని కుల రాజకీయం మొదలు పెట్టారిన ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టడమే కాకుండా, ఆ స్థలానికి చెందిన డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారని అరెస్టు చేశారని వివరించారు. ఇంత తప్పు చేసిన అయ్యన్నను అరెస్ట్ చేస్తే.. టీడీపీ నాయకులు దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం  చేస్తున్నారన్నారు. 

Also Read : Chandrababu :ఎలక్షన్ తర్వాత జగన్ మళ్లీ జైలుకే, అయ్యన్న అరెస్టుపై చంద్రబాబు వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget