అన్వేషించండి

Kodi Kathi Case: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్‌ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ

Kodi Kathi Srinivas : కోడి కత్తి శీనుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Kodi Kathi Case Telugu News: కోడి కత్తి శీను... రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. 2018లో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తితో శీను దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆ దాడిపై సానుభూతితోనే జగన్ సీఎం అయ్యారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఆ తర్వాత శీను ఐదేళ్లపాటు జైల్లో ఉన్నాడు. చివరకు 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఏపీ హైకోర్టు అనుమతితో బెయిల్ పై విడుదలయ్యారు.

బెయిల్ రద్దుకు ఒప్పుకోని సుప్రీంకోర్టు  
 శీనుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్ఐఏ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయించింది. కోడికత్తి శీను బెయిల్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో ఎన్‌ఐఏ టార్గెట్‌గా మారింది. ఇది ఇలా ఉండగా, 2024 ఎన్నికలకు ముందు శీను జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని శీను తెలిపారు. కులతత్వం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. మరోవైపు ఈ కేసులో జగన్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. సీఎం హోదాలో బిజీగా ఉన్న జగన్ విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అలాగే ప్రతిపక్ష నేతగా కూడా లేని జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఖాళీగా ఉన్నందున విచారణకు హాజరవుతారా లేక మరేదైనా కారణంతో యధావిధిగా కోర్టుకు గైర్హాజరవుతారా అనేది చూడాలి.

అసలేం జరిగిందంటే..
 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై శ్రీనివాస్ కోడి కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది.  జగన్ విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు అని విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో పనిచేస్తున్న జనుపెళ్ల శ్రీనువాసరావు సెల్ఫీ దిగేందుకు వైఎస్‌ జగన్‌ వద్దకు వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఘటన అనంతరం జగన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిఫారసు మేరకు కేసును జనవరి 1, 2019న ఎన్ఐఏకి బదిలీ చేశారు. అదే ఏడాది మే 28న నిందితుడికి బెయిల్ మంజూరైంది.

అయితే, ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించడంతో.. బెయిల్‌ను రద్దు చేసింది. రెండు నెలల తర్వాత ఆగస్టు 13న నిందితుడు మళ్లీ జైలుకు వెళ్లాడు. అప్పటి నుంచి శ్రీనివాస్ జైల్లోనే ఉన్నాడు. రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును 2023 సెప్టెంబర్ 6న విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. శ్రీను బెయిల్ పిటిషన్ ను విచారించిన ఏపీ హై కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టి, ఫిబ్రవరి 8న బెయిల్ మంజూరు చేసింది. 
 
టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు  
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్‌ నిరాకరించింది. నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అనారోగ్య కారణాలతో గిరి రాంబాబు అనే వ్యక్తికి మాత్రం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.  2021 అక్టోబరు 19న వైసీపీకి చెందిన కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్లతో చెలరేగిన పోయిన అల్లరి మూక ఆఫీసులోని ఫర్నీచర్‌తో ఆఫీసు అద్దాలు, కార్లను ధ్వంసం చేస్తూ రెచ్చిపోయారు. అయితే ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kolkata: ఆ రాత్రంతా ఇద్దరు వేశ్యలతో నిందితుడు, రెడ్‌లైట్ ఏరియా నుంచి నేరుగా హాస్పిటల్‌కి - ఆపై డాక్టర్‌పై హత్యాచారం
ఆ రాత్రంతా ఇద్దరు వేశ్యలతో నిందితుడు, రెడ్‌లైట్ ఏరియా నుంచి నేరుగా హాస్పిటల్‌కి - ఆపై డాక్టర్‌పై హత్యాచారం
Telangana News: పోచారం శ్రీనివాస్‌కు కీలక పదవి, కేబినెట్ హోదా - కాంగ్రెస్‌లో విమర్శలు!
పోచారం శ్రీనివాస్‌కు కీలక పదవి, కేబినెట్ హోదా - కాంగ్రెస్‌లో విమర్శలు!
HCL in AP: ఏపీలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ, 15 వేల మందికి ఉద్యోగాలు
ఏపీలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ, 15 వేల మందికి ఉద్యోగాలు
Mpox: టెన్షన్‌ పెడుతున్న మంకీపాక్స్‌- ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ‌- వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..?
టెన్షన్‌ పెడుతున్న మంకీపాక్స్‌- ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ‌- వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Yuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP DesamWedding Card Like Question Paper Style | ప్రశ్నాపత్రంలా పెళ్లి పత్రిక..టీచర్ వినూత్న ప్రయత్నం | ABPRaksha Bandhan | Sister Ties Rakhi to brother From hostel Room Winodw| కిటికిలోంచి రాఖీ కట్టిన అక్క

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata: ఆ రాత్రంతా ఇద్దరు వేశ్యలతో నిందితుడు, రెడ్‌లైట్ ఏరియా నుంచి నేరుగా హాస్పిటల్‌కి - ఆపై డాక్టర్‌పై హత్యాచారం
ఆ రాత్రంతా ఇద్దరు వేశ్యలతో నిందితుడు, రెడ్‌లైట్ ఏరియా నుంచి నేరుగా హాస్పిటల్‌కి - ఆపై డాక్టర్‌పై హత్యాచారం
Telangana News: పోచారం శ్రీనివాస్‌కు కీలక పదవి, కేబినెట్ హోదా - కాంగ్రెస్‌లో విమర్శలు!
పోచారం శ్రీనివాస్‌కు కీలక పదవి, కేబినెట్ హోదా - కాంగ్రెస్‌లో విమర్శలు!
HCL in AP: ఏపీలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ, 15 వేల మందికి ఉద్యోగాలు
ఏపీలో హెచ్‌సీఎల్‌ భారీ విస్తరణ, 15 వేల మందికి ఉద్యోగాలు
Mpox: టెన్షన్‌ పెడుతున్న మంకీపాక్స్‌- ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ‌- వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..?
టెన్షన్‌ పెడుతున్న మంకీపాక్స్‌- ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ‌- వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..?
Hyderabad News: హైదరాబాద్‌లో ఆమ్రపాలికి కీలక పదవి - మరో ఆరుగురు IASల ట్రాన్స్‌ఫర్
హైదరాబాద్‌లో ఆమ్రపాలికి కీలక పదవి - మరో ఆరుగురు IASల ట్రాన్స్‌ఫర్
Indra Movie:
"ఇంద్ర" సక్సెస్ సీక్రెట్ చెప్పిన చిరంజీవి- రీ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల
Renu Desai: నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తున్నా - రేణు దేశాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
నా కూతురికి ఎముకలు విరగొట్టడం నేర్పిస్తున్నా - రేణు దేశాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Bandi Sanjay: కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కవితకు బెయిల్ ఇప్పించేది కాంగ్రెస్సే, ఇదిగో ప్రూఫ్ - బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Embed widget