Janasena Kiran Royal : జగన్ గెలిస్తే వైజాగ్ వరకూ పోస్టర్లు వేస్తా - తిరుపతి జనసేన నేత చాలెంజ్
Andhra News : బెట్టింగ్‌ల కోసమే గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారని కిరణ్ రాయల్ అన్నారు. జగన్ గెలిస్తే తిరుపతి నుంచి విశాఖ వరకూ పోస్టర్లు వేస్తానన్నారు.
Elections 2024 : జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ఆయన ప్రమాణస్వీకార ఆహ్వానపత్రాన్ని తిరుపతి నుంచి విశాఖ వరకూ పోస్టర్లుగా వేయిస్తానని చాలెంజ్ చేశారు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదాలో జనసేన చివరి ప్రెస్ మీట్ అని 96 గంటల తరువాత... ఏపీ ప్రజల కూటమి గెలిపించారని దేశం మొత్తం తెలుస్తుందని ప్రకటించారు. అనేక కేసులు, ఇబ్బందులు తరువాత జగన్ ను తరిమికొట్టామమన్నారు.
ఉస్తాద్ , పహిల్వాల్‌లను దించి కౌంటింగ్ కేంద్రాల వద్ద విధ్వంసాలు సృష్టించేలా సజ్జల మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు. నాగబాబు అందరిని మంచిగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉండాలని సూచిస్తే.. సజ్జల మాత్రం బెదిరించి కౌంటింగ్ చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 9న వైజాగ్ గెలుస్తున్నాము.. రూములు ఖాళీ లేవు, రైళ్లు బుకింగ్ పూర్తి అయ్యిందని అంటున్నారు.. ఇలా మాట్లాడి బెట్టింగ్ లకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు అందరూ వెళ్లి సముద్రంలో దూకాల్సి వస్తుందని హెచ్చరించారు.
రోజా అవ్వ పైన ఎవరు బెట్టింగ్ వేయడం లేదు... ఆమె వేస్తే నేను వేస్తాను బెట్టింగ్ అని సవాల్ చేశారు. 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాలకు స్వస్తి చెప్పి జగన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన స్వాగతం పోస్టర్లు తిరుపతి నుండి వైజాగ్ వరకు అంటిస్తానని సవాల్ చేశారు. తాడేపల్లి ప్యాలస్ ఎగిరిపోతుంటే... సజ్జల భజన చేస్తున్నారని విమర్శించారు. కూటమి 140 పైగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర బాగు కోసం పవన్ కళ్యాణ్ కోరుకున్న విధంగా కూటమి ప్రభుత్వం గెలుస్తుందని.. తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 20 పైన మెజారిటీతో గెలుస్తున్నారని జోస్యం చెప్పారు.
వందకు వందశాతం భారీ మెజార్టీతో, తుఫానుతో తాము గెలుస్తున్నామని, 140కి పైగా సీట్లు సాధించబోతున్నామని కిరణ్ రాయల్ తెలిపారు. పవన్ కోరుకున్నట్లుగా తాము గెలుస్తున్నామన్నారు. అక్కడ మోడీ, ఇక్కడ కూటమి సీఎం ప్రమాణస్వీకారం చేయడం ఖాయమన్నారు. తన సవాల్ ను స్వీకరిస్తారా అని వైసీపీని సవాల్ చేశారు.
తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసేందుకు కిరణ్ రాయల్ ప్రయత్నించారు. అయితే చివరికి వైసీపీ నుంచి వలస వచ్చిన ఆరణి శ్రీనివాసులుకు టిక్కెట్ దక్కడంతో నిరాశకు గురయ్యారు. తీవ్ర అసంతృప్తికి గురైనా.. చివరికి పార్టీ విజయం కోసం కిరణ్ రాయల్ తీవ్రంగా శ్రమించారు. వైసీపీపై పోరాటంలో కొన్ని కేసుల్లో కూడా ఇరుక్కున్నారు.