అన్వేషించండి

Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!

Vishnu Vardhan Reddy Rally Kadiri: కదిరి నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ మధ్య రచ్చ ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో పదవి పొంది నియోజకవర్గానికి వస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి ఫ్లెక్సీలను కొందరు చించి వేశారు.

Kandikunta Prasad Vs Vishnu Vardhan Reddy:   ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పాత రాజకీయ కక్షలు, ఆధిపత్య పోరు మళ్లీ రచ్చకెక్కుతోంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మాత్రం ఉప్పు, నిప్పులా పరిస్థితి మారింది.  బీజేపీ నాయకుడు, అనుబంధ సంఘాల జాతీయ సహ కోఆర్డినేటర్‌గా నియమితులైన విష్ణువర్ధన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మిత్రపక్షాల మధ్య వాతావరణం ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలో ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో పెద్ద కలకలం రేపింది.

బీజేపీ అనుబంధ సంఘాల జాతీయ సహ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి ఈ నెల 5వ తేదీన కదిరికి రానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ,  విష్ణువర్ధన్ రెడ్డి  ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. అయితే, వాటిని కొంత మంది చించి వేశారు.  ఆ ఫ్లెక్సీలను కావాలనే ధ్వంసం చేశారని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.                    

ఈ ఫ్లెక్సీల ధ్వంసం వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ వర్గీయుల హస్తం ఉందనే అనుమానాలను బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కదిరి నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను, బీజేపీ బలోపేతాన్ని తట్టుకోలేకే కూటమి ధర్మాన్ని పక్కనబెట్టి టీడీపీ నేతలు ఇటువంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా కదిరిలో కందికుంట వర్గానికి, విష్ణువర్ధన్ రెడ్డి వర్గానికి మధ్య అంతర్గతంగా నడుస్తున్న ఆధిపత్య పోరే ఈ ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.                

సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ  కెమెరా ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఫ్లెక్సీలు చించిన టీడీపీ నేతల బండారం పూర్తిగా బయటపడుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అధికార బలంతో మిత్రపక్షాలపై ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని, పోలీసులు తక్షణమే స్పందించి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.           

కూటమి కట్టుబాట్లను దాటి కదిరిలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య బహిరంగంగా సాగుతున్న ఈ ఘర్షణ వాతావరణం ఇప్పుడు జిల్లా రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసుల విచారణ ఏ మలుపు తిరుగుతుందో, అలాగే టీడీపీ-బీజేపీ అగ్రనాయకత్వాలు స్థానిక నేతల మధ్య ఉన్న ఈ వైరాన్ని ఎలా చల్లారుస్తాయో వేచి చూడాలి.     

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
Cyclone Akwan: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్.. మరికొన్ని గంటల్లో తుపానుగా మారనున్న వాయుగుండం
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్.. మరికొన్ని గంటల్లో తుపానుగా మారనున్న వాయుగుండం
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget