అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

KA Paul : విశాఖ పోలీస్ కమిషనర్‌కు కేఏ పాల్ ఫిర్యాదు - అయకు వచ్చిన కష్టం ఏమిటంటే ?

తన ఫోటోలు మార్ఫింగ్ చేశారని విశాఖ పోలీసులకు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 

KA Paul :   ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి  ప్రచారం  చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ ఫోటోలతో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం విశాఖపట్నం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల రాజమహేంద్రవరం మంజీర హోటల్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల తొలి సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లు తొలుత షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.  ఆ ఫోటోలో  ఇద్దరి మధ్య చర్చలు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు. వాటితో ఫ్లెక్సీ వేయించారు. ఆ ఫ్లెక్సీ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని..   అయితే తనను కించపరిచే విధంగా ఫోటోలు షేర్ చేశారని కేఏ పాల్ ఫీలయ్యారు. ఈ ఫోటోల మార్ఫింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. 

కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ పెట్టి .. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏమి జరిగినా స్పందిస్తూ ఉంటారు. ఆయనపై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్ వస్తూ ఉంటాయి. గతంలో తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు ఓ సారి దాడి కూడా జరిగింది.   రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళుతుండగా.. సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును ఖండించిన పాల్.. వారితో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్ ను చంపదెబ్బ కొట్టాడు. దాంతో కేఏ పాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.                   

ఆ తర్వాత తెలంగాణలో పర్యటించడం తగ్గించుకున్నారు. అయితే ప్రతీ సందర్భంలోనూ అతిశయం అనిపించే ప్రకటనలు చేస్త ఉంటారు. మునుగోడు ఉపఎన్నికల్లోనూ పోటీ చేశారు. రకరకాల వేషాలు వేశారు.కానీ డిపాజిట్ దక్కలేదు. పవన్ కల్యాణ్ తన పార్టీలోకి వస్తే సీఎం ను చేస్తానని చెబుతూ ఉంటారు. తాను ప్రధానమంత్రి అవుతానంటారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను సీఎంను చేయబోతున్నారని చెబుతారు. ఇలాంటి ప్రకటనలతో కేఏ పాల్ రాజకీయాల్లో ఓ భిన్నమైన వ్యక్తిగా చెలామణి అవుతున్నారు. సోషల్ మీమర్స్..  బ్రహ్మానందంతో పాటు కేఏ పాల్ హావభావాలు ఉండే ఫోటోలను ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇలా ..  లోకేష్, పవన్ ను.. ఆశీర్వదిస్తున్నట్లుగా కొంత మంది మీమ్ తయారు చేయడంతో పాల్ కు ఆగ్రహం వచ్చింది. అందుకే ఫిర్యాదు చేశారు.        

ఫిర్యాదు అందుకున్నామని పోలీసులు ఎక్నాలడ్జ్ ఇచ్చారు. కేసు నమోదు చేశారో లేదో స్పష్టత రావాల్సి ఉంది.                                 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget