News
News
X

AP Telangana Breaking News: నోవాటెల్ హోటల్ లో జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

FOLLOW US: 
నోవాటెల్ లో జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ

Hero Nithin : హైదరాబాద్ నోవాటెల్ లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ అయ్యారు. తెలంగాణ పర్యటనలో ఉన్న జేపీ నడ్డా శనివారం ఉదయం మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ తో సమావేశం అయ్యారు. 

సెప్టెంబర్ 12 నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఖరారు అయింది. సెప్టెంబర్ 12 నుండి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుందని బీజేపీ ప్రకటించింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.

రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో. జరిగిన అవకతవకలపై బాద్యులను శిక్షించాలనీ, ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో  సిఎం కేసిఆర్ ను డిమాండ్ చేశారు. మొత్తం 5 డిమాండ్లను ఆయన పెట్టారు. 

డిమాండ్లు...

1. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ లను బర్తరఫ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి విచారన జరపాలి 

2. ఉద్యోగాలు తొలగించిన అందరికి తిరిగి ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి.

3. మృతులు హరీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 50 లక్షల నష్టపరిహారాన్ని ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

4. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, కవ్వం పల్లి సత్యనారాయణ, అది శ్రీను,  తదితరులను వెంటనే విడుదల చేయాలి.

5. మొత్తం వ్యవహారం లో కేసీఆర్ స్పందించి సమగ్ర విచారణ చేయాలి..

Praja Sangrama Yatra: ముగిసిన బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

* దిగ్విజయంగా ముగిసిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర.
 * భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగించిన బండి సంజయ్.
*  3వ విడత చివరి రోజు 14 కిలోమీటర్లు నడిచిన బండి సంజయ్
* మరి కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర జాతీయ నేతలతో కలిసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొనున్న బండి సంజయ్...

ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో చిరుత కళేబరం కలకలం

చిత్తూరు : ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో చిరుత పులి కళేబరం కలకలం రేపుతుంది..కుప్పంకు సమీపంలోని సారెకల్‌ అటవీ ప్రాంతంలో చిరుత కళేబరాన్ని పశువుల కాపరులు గుర్తించారు.. గత కొద్ది‌ రోజుల క్రితం చిరుత మృతి చేందినట్లు గుర్తించిన పశువుల కాపరులు అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించారు.. విషయం తెలుసుకున్న అటవీ శాఖా అధికారులు ఘటన స్ధలంకు చేరుకుని చిరుత పులి కళేబరాలను పరిశీలించారు.. దీనిపై కేసు నమోదు చేసిన అటవీ శాఖా సిబ్బంది, చిరుత పులి మృతికి గల‌ కారణాలపై ఆరా తీస్తున్నారు.. సారెకల్‌ అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వేటగాళ్లు సంచరిస్తున్నట్లు స్ధానికుల సమాచారం మేరకు అటవీ శాఖా అధికారులు పలుకోణాల్లో దర్యాప్తు సాగుస్తున్నారు..

చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు - మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన విషయం చంద్రబాబుకు తెలియదా..?

కుప్పం ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదు

కుప్పంలో వైసిపి కార్యకర్తలపై దాడి చేసింది టిడిపి నేతలే..

మూడేళ్ళలో కుప్పంకు ఆరు సార్లు మాత్రమే చంద్రబాబు కుప్పంకు వచ్చారు..

30 సంవత్సరాల్లో కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థిని శూన్యం..

కుప్పంలో పెండింగ్ లో ఉన్న తాగు-సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..

సిఎంను, నన్ను విమర్శిస్తూ టిడిపి అధినేత శునకానందం పొందుతున్నారు..

మూడు రోజుల చంద్రబాబు పర్యటనలో అధికంగా గాయపడింది వైసిపి కార్యకర్తలే..

బయటి వ్యక్తులను తీసుకొచ్చి మా పార్టీ కార్యకర్తలపై టిడిపి నేతలు దాడి చేయించారు..

ప్రపంచంలోనే  పనికి మాలిన రాజకీయ నాయకుడు చంద్రబాబు..

ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందుతున్నాయి..

కుప్పంలో వైసిపి విజయం ఖాయం..   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపి మంత్రి-


కుప్పంలో 7వేల ఇళ్ళను నిర్మించి ఇచ్చాం..

మరో 3వేల ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయి..

చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పంలో ఒక్కరికైనా ఇల్లు కట్టించి ఇచ్చారా..?  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపి మంత్రి-

బ్యానర్లు చించి, రాళ్ళతో వైసిపి కార్యకర్తలను కొట్టారు..

నారా లోకేష్ మంగళగిరిలోనే ఘోరంగా ఓడిపోయాడు..

కొడుకును గెలిపించుకోలేని వ్యక్తి చంద్రబాబు..

చంద్రబాబు తన హోదాను తానే దిగజార్చుకుంటున్నాడు..

వైసిపి కార్యకర్తల ఇంటిపై కట్టిన జెండాలను చించేశారు..

Guntur Crime: గుంటూరు జిల్లాలో ఈత‌ సరదాకు విద్యార్థి మృతి

గుంటూరు జిల్లాలో ఈత‌ సరదాకు విద్యార్థి బలి

నిడుబ్రోలు గ్రామంకు చెందిన కె. పృద్వి (17) విద్యార్థి మృతిచెందాడు. కాలేజీలకి సెలవు కావడంతో సరదాగా అలవల కెనాల్ లోకి ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు. ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు కాల్వలోకి దిగగా,  నీళ్ల ఉదృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురు కొట్టుకపోపోయారు. సమీపంలో పొలాల్లో వరి నారు తీస్తున్న కూలీలు గమనించి ఇద్దరు విద్యార్థులను కాపాడారు. కానీ పృద్విని రక్షించలేకపోయారు. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు పృథ్వి. విద్యార్థి చనిపోవడం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

వైసీపీపై పోస్టులు - బొబ్బూరి వెంగళరావు అరెస్ట్, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు

అధికార పార్టీపై వ్యతిరేక పోస్టులు పెడుతూ రెచ్చ గొడుతున్నాడు అన్న అభియోగంపై బొబ్బూరి వెంగళరావును సీఐడీ పోలీసులు గురువారం అర్థరాత్రి అరెస్టు చేసారు.. ఘర్షణా మీడియా పేరుతో యూట్యూబ్ చానల్‌ నిర్వహిస్తున్నడు వెంగళరావు.. నిన్న డీజీపీ కార్యలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొని వెళుతున్న సందర్భంలో సీఐడీ పోలీస్ అదుపులో తీసుకొని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకు వెళ్ళారు. నిన్న రాత్రి జడ్జీ ముందు హాజరు పరచగా కన్నీళ్ళు ‌పర్యంతరం అయ్యడు వెంగళరావు.. పోలీసులు బట్టలు విప్పి తీవ్రంగా హింసించారని తెలిపాడు.. కస్టడీలో ‌కొట్టినట్లు చెబితే తన రెండేళ్ళ కుమారుడిని చంపివేస్తామని హెచ్చరించారు అని తెలిపాడు.. తాము చెప్పినట్లు నడుచుకోపోతే బెయిల్  కూడ్ రాదని.. పలుకేసులు తనపై కుటుంబ సభ్యులపై నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తామని బెదిరించారని తెలిపాడు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని నడవలేని స్థితిలో ఉన్నానని తెలిపాడు. సీఐడీ పోలీసుల తీరుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు.

Tirumala News: తిరుమలలో‌ భక్తుల రద్దీ

తిరుపతి : తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది.. నిన్న 26-08-2022 రోజున 69,012 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 29,195 మంది తలనీలాలు సమర్పించగా, 4.59 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా, స్వామి వారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది..

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్యోగ బాధితుడు ఆత్మహత్య

రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగ బాధితుడు ముంజ హరీష్ కమాన్ పూర్ వద్ద బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం కోసం 8 లక్షల రూపాయలు ఇచ్చిన హరీష్. తన చావుతోనైనా బాదితులకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేశాడు. తనకు వచ్చే డబ్బులు కుటుంబానికి ఇవ్వాలని వేడుకున్నాడు. మృతుడు హరీష్ ది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాలపూర్.

Background

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్‌ జోన్‌ను పునర్విభజన చేశారు. శంషాబాద్ జోన్ ను రెండు జోన్లుగా విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రస్తుతం ఉన్న శంషాబాద్‌ జోన్‌ను రెండుగా విభజించి, కొత్తగా రాజేంద్రనగర్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. దాంతో ఇకనుంచి రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లుగా సేవలు అందించనున్నాయి. ప్రభుత్వం విభజించిన ప్రకారం ఈ కొత్త జోన్‌ రాజేంద్రనగర్ లో చేవెళ్ల, రాజేంద్రనగర్‌ డివిజన్లు ఉంటాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ తెలంగాణ ప్రభుత్వానికి శంషాబాద్ జోన్ పునర్ విభజనపై రిపోర్ట్ అందించారు. దీనికి సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్‌ను శంషాబాద్, రాజేంద్ర నగర్ రెండు జోన్లుగా విభజించింది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, యానాంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఆగస్టు 31 వరకు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ కావడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 31 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 24, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు నమోదైంది. పశ్చిమ దివ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. 

అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆగస్టు 31 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.

బులియన్ మార్కెట్‌లో గత వారం తగ్గిన బంగారం ధరలు ఈ వారం పెరుగుతున్నాయి. ధర తగ్గడంతో ఇటీవల బంగారం కొనుగోళ్లు పెరిగాయి. తాజాగా వరుసగా మూడోరోజు పసిడి ధర ఎగబాకింది. పసిడి బాటలోనే వెండి పయనిస్తోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.160 మేర పెరగడంతో ఇక్కడ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,980 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉంది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర నేడు రూ.61,300గా ఉంది. నేడు రూ.200 మేర ధర పెరిగింది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,980 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 గా ఉంది. ఈ పట్టణాల్లో వెండి నేడు వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. 
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 27 August 2022) 10 గ్రాముల ధర రూ.52,980 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 గా ఉంది. రూ.200 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,300 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.