అన్వేషించండి

Jogi Ramesh : దండయాత్రకు కాదు .. వినతిపత్రం ఇవ్వడానికే వెళ్లా ! జోగి రమేష్ వివరణ

సీఎంపై దూషణలు ఆగకపోతే శుక్రవారం జరిగింది ఆరంభమేనని జోగి రమేష్ హెచ్చరించారు. అయితే తాను దండయాత్రకు వెళ్లినట్లుగా చేస్తున్న ప్రచారం సరి కాదన్నారు. తాను ఆర్జీ ఇవ్వడానికే వెళ్లానన్నారు.


చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రకు వెళ్లలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్పష్టం చేశారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలంతా మెచ్చుకునే విధంగా పాలన చేస్తుంటే జగన్‌ మోహన్‌ రెడ్డి, మహిళ అయిన హోంమంత్రిని అయ్యన్నపాత్రుడు అమ్మనా బూతులు తిట్టారని విమర్శించారు. పత్రికల్లో రాయలేని విధంగా, టీవీల్లో చూపించలేని విధంగా ఉన్న అయ్యన్న మాటలు చంద్రబాబు స్క్రిప్టేనన్నారు.  ప్రజాస్వామ్య పద్దతిలో చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద నిరసన తెలియచేయడానికి వెళ్లానని దండయాత్రకు కాదన్నారు. అయితే తాను కారు దిగక ముందే తన కారుపై రాళ్లు వేశారని ఆరోపించారు. Also Read : డ్రగ్స్ కేసులో తరుణ్, పూరీలకు క్లీన్ చిట్ ! మరి మిగతా వాళ్ల సంగతేంటి ?
  
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే  ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఒక పౌరుడిగా, బాధ్యతగల వ్యక్తిగా నిరసన తెలియచేయడానికి మాత్రమే వెళ్లానని జోగి రమేష్ పదే పదే తెలిపారు. అలా వెళ్లినందుకే తమపై దాడి చేసి అన్ని విధాలుగా రచ్చ చేసి తిరిగి నిందలు వేస్తున్నారని జోగి రమేష్ అన్నారు. గూండాలను తెచ్చింది, పంపించిందీ చంద్రబాబు నాయుడనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఏవైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రిగారికి అర్జీ ఇవ్వడానికి నిరసన తెలియచేయడానికి వెళతమని.. అలాగే తాను చంద్రబాబు ఇంటికి వెళ్లామన్నారు. టీడీపీ నేతలు కూడా నిరసన,ముట్టడి చేపట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎప్పుడైనా ఎదురుదాడి చేశారా అని ప్రశ్నించారు. Also Read : చంద్రబాబుకు జగన్ క్షమాపణలు చెప్పాలన్న రఘురామ !

చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తూ మళ్లీ తమపైనే ఎదురుదాడి చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. అయ్యన్నపాత్రుడితో ఆ మాటలు మాట్లాడిస్తూ సమాజంలో చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడానికి అరాచకాలు పన్నేందుకు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. తాను ఆర్జీ ఇవ్వడానికి వచ్చానని దీన్ని కూడా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో పరివర్తన రావాని  అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలపై చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. Also Read : ఎంఐఎంనే టార్గెట్ చేసిన అమిత్ షా ! ఢిల్లీలో దోస్తి - తెలంగాణలో కుస్తీ బీజేపీ విధానం అదేనా !?

ప్రభుత్వ పథకాలు ఎవరికైనా అందకపోతే వారికి ఇవ్వాలనిఅజగాలని అంతే కానీ బూతు పురాణం వినిపించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రెచ్చగొట్టే కార‍్యక్రమాలు చేస్తే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.  ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడే భాషను మార్చుకోకపోతే చంద్రబాబు ఎక్కడ పర్యటించినా అడ్డుకుని నిరసన తెలుపుతామని జోగి రమేష్ హెచ్చరించారు.  చివరిగా వ్యక్తిగత దూషణలు జరిగేతే మాత్రం నిన్న జరిగింది ఆరంభం మాత్రమేనని ఇంకా చాలా ఉంటుందని హెచ్చరించారు. టీడీపీ నేతలు తమ నిరసనను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తే తాము కూడా అయ్యన్న వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు 

 

Also Read : పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..

టాప్ హెడ్ లైన్స్

Fishermen Boat Tragedy: బోటు మునిగి ఏడుగురు జాలర్లు మృతి, ఇద్దరు గల్లంతు.. అధికారులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బోటు మునిగి ఏడుగురు జాలర్లు మృతి, ఇద్దరు గల్లంతు.. అధికారులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
AP ED Money Laundering Probe: ఏపీలో కేసులన్నీ ఆ ఒక్కరి వైపే మళ్లుతున్నాయా? ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తులో తేలనున్న సూత్రధారి ఎవరు?
ఏపీలో కేసులన్నీ ఆ ఒక్కరి వైపే మళ్లుతున్నాయా? ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తులో తేలనున్న సూత్రధారి ఎవరు?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
Embed widget